బుల్లితెరలో దుమ్మురేపుతున్న హాట్ యాంకర్ అనసూయ, అప్పుడప్పుడు వెండితెర మీద కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇప్పటికే రాంచరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా అదరగొట్టింది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తన ప్రతిభను అందరికీ పరిచయం చేసింది అనసూయ. పుష్ప మూవీలో కూడా మరో మంచి క్యారెక్టర్ చేస్తోంది. తాజాగా ఇప్పుడు మరో సినిమాను సైలెంట్ గా పూర్తి చేస్తోంది అనసూయ. ఆ మూవీకి సంబంధించిన పోస్టర్ ను అభిమానులతో పంచుకుంది. ఈ మూవీని పేపర్ బాయ్, విటమిన్ షీ తదితర చిత్రాలను తీసిన జయశంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో అనసూయ కొత్త లుక్ లో కనిపిస్తోంది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

కొత్తగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో మన రంగమ్మత్త ఎయిర్ హోస్టెస్ గా నటిస్తోందని తెలుస్తోంది. ఇందులో తనది కేవలం ఎయిర్ హోస్టెస్ క్యారెక్టర్ మాత్రమే కాదని.. నటనకు అవకాశం ఉందని చెబుతోంది అనసూయ. తాను ఈ మూవీలో నటన ఇరగదీశానని తన ఫ్రెండ్స్ కు చెప్పుకుంటోందట అనసూయ. ఈ మూవీలో తన క్యారెక్టర్ చూసి అందరూ షాకవుతారని కూడా చెప్పుకొచ్చింది. అందరూ పుష్ప మూవీలో దాక్షాయణి పాత్ర తనకు పేరు వస్తుందని అనుకుంటున్నారని.. అయితే అంతకు మించి ఈ ఎయిర్ హోస్టెస్ పాత్ర తనకు పేరు తీసుకు రాబోతోందని అంటుంది అనసూయ.

జబర్దస్త్ తో పాటూ టీవీ షోల ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నానని చెప్పింది ఈ బ్యూటీ. తాను సినిమాల్లో నటించేది డబ్బుకోసం కాదని.. సినిమాల్లో వచ్చే డబ్బు తనకు అవసరం లేదని.. పేరు తీసుకొచ్చే పాత్రలు చేస్తే చాలంటోంది. ఏమో.. ఒక సినిమా గురించి రంగమ్మత్త ఇంతగా చెబుతోందంటే ఆ మూవీలో ఏ రేంజ్ పర్ఫామెన్స్ ఇరగదీసి ఉంటుందోనని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. బుల్లితెరపై తన అందచందాలను ఆరబోసే అనసూయకు.. ఎయిర్ హోస్టెస్ క్యారెక్టర్ చక్కగా సరిపోతుందని, ఆమె ఫిజిక్ అందుకు కరెక్ట్ గా సెట్ అవుతుందని అభిమానులు  భావిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: