మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను... దర్శకుడిగా చేసింది నాలుగు సినిమాలే అయినప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్. ఒక్కో సినిమా ఒక్కో అద్భుతం. ప్రభాస్ లో మిర్చి, మహేష్ బాబు ను శ్రీమంతుడు గా, ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రిపేర్ చేసేవాడుగా చేసి ప్రేక్షకుల మనసుని హత్తుకునేలా చూపించాడు. ఒక్కో హీరోలోనూ ఒక్కో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. వాళ్ళ అభిమానులను ఖుషి చేశాడు. మరోసారి మహేష్ బాబును 'భరత్ అనే నేను' అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేలా చేశాడు. ఒక యువకుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ప్రభావవంతంగా చూపించాడు. ఇలా ఒక్కో హీరోనూ ఒక్కో కోణంలో చూపించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నారు.

ఆయన చేసేలా సినిమాల్లో ఆకట్టుకునే కథాంశం తో పాటు సోషల్ మెసేజ్ ఎలిమెంట్ ప్రత్యేకంగా ఉంటుంది. అందులో కమర్షియల్ అంశాలను మేళవించి, సామాజిక అంశానికి ముడిపెడుతూ కొరటాల తీసే సినిమా ఎవరినైనా యిట్టె ఆకట్టుకుంటుంది. ఆయన ప్రతి సినిమా లో ఉండే కామన్ పాయింట్, టచ్ చేసే అంశం సోషల్ మెసేజ్. కొరటాల సినిమా అంటే ప్రేక్షకులు ముందే ఫిక్సయి పోవచ్చు. అలాగే హీరో ఎలివేషన్, కమర్షియల్ అంశాలు, పాటలు, రొమాన్స్ కు కూడా ఏమాత్రం కొదవ ఉండదనే చెప్పాలి.

ఇప్పుడు "ఆచార్య" తో మరో మెగా కథాంశాన్ని టచ్ చేయబోతున్నాడు. ఇందులో దేవాలయాల విషయం ప్రస్తావన కు రానుంది అంటున్నారు. అందుకే స్టార్ హీరోలంతా ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. కొరటాలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండవసారి పని చేయబోతున్నారు. మహేష్ బాబు ఇప్పటికే ఆయనతో కలిసి రెండు సినిమాలు చేశారు. మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేయబోయే సినిమా, ఎన్టీఆర్ తో మూవీ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: