ఏమాటకామాటే గత రెండేళ్ల నుంచి సినిమా పరిశ్రమ పరిస్థితి దారుణంగా ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల నుంచి కూడా తెలుగు సినిమాలో చాలా మంది నిర్మాతలు సినిమాలు విడుదల కాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా అనేక కష్టాలు పడుతూ ఆస్తులను కూడా అమ్ముకొనే పరిస్థితి ఉంది అనే మాట అక్షరాలా నిజం. చాలామంది హీరోలకు భారీగా అడ్వాన్సులు ఇచ్చిన అగ్ర నిర్మాతలు ఈ మధ్య కాలంలో అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఆస్తులు అమ్ముకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

గతంలో విజయవంతంగా సినిమాలు నిర్మించిన అగ్రనిర్మాత లో ఇప్పుడు కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారని ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖ నిర్మాత భారీగా ఆస్తులు కూడా అమ్ముకున్నారని దాదాపుగా 18 ఎకరాల పొలం అమ్ముకుని ఆయన మళ్లీ సినిమా పరిశ్రమలో నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో ఉన్న 18 ఎకరాల పొలం అమ్ముకోవడానికి ఆయన ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటున్నారు అని దీని ద్వారా దాదాపుగా ఒక వంద కోట్లకు పైగా ఆయనకు వచ్చే అవకాశం ఉంటుందని దీనికి సంబంధించి ఒక రాజకీయ నాయకుడు ద్వారా ముందుకు వెళుతున్నారు సమాచారం.

అగ్ర నిర్మాత గతంలో భారీ బడ్జెట్ సినిమాలు తీసి మంచి లాభాలను ఆర్జించిన సరే ఈ మధ్యకాలంలో హీరోల సినిమాల షూటింగ్ ముందుకు వెళ్లకుండా ఇబ్బందులు పడటం తోనే ఈ విధంగా ముందుకు వెళుతున్నారని ప్రస్తుత ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు ప్రతి సినిమా పరిశ్రమలో కూడా చాలా మంది పరిస్థితి ఇదే విధంగా ఉందని మరికొంతకాలం ఇదేవిధంగా పరిస్థితి కొనసాగితే మాత్రం ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రం అయ్యే అవకాశాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: