దక్షిణ భారతదేశంలోనే ఇంకా చెప్పాలంటే భారత దేశంలోని అన్ని సినిమా పరిశ్రమలో... ఏ సినిమా పరిశ్రమలోనూ హీరోలకు లేని గౌరవం మన తెలుగు సినిమా హీరోలకు దక్కుతుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఒకే వంశం నుంచి మూడో తరం హీరోలను కూడా నెత్తిన పెట్టుకుని ఆదరిస్తున్నారు అంటే మన తెలుగు ప్రేక్షకులు , తెలుగు ప్రజలు ఎంత మంచి వారు అర్థం చేసుకోవచ్చు. సినిమా వాళ్ళు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా మన తెలుగు ప్రజలు స్పందిస్తూ ఉంటారు. అయితే తెలుగు ప్రజలు కష్టాల్లో ఉంటే సినిమా హీరోలు... సినిమా పరిశ్రమ ఎంత వరకు స్పందిస్తుంది అంటే అది కొంతవరకు మాత్రమే అని చెప్పాలి.

గతంలో ఎన్టీఆర్ - ఏఎన్నార్ - సూపర్ స్టార్ కృష్ణ టైంలో తెలుగు ప్రజలకు ఇబ్బంది వస్తే వాళ్లు స్వచ్ఛందంగా స్పందించడంతో పాటు తమ అభిమానులను సైతం సహాయ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా ఉండాలని పిలుపు ఇచ్చారు. అయితే ఇప్పటి హీరోలకు అసలు ఆ దృక్పథమే కొరవడింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ విషయం మన హీరోలు తమిళ హీరోలని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అక్కడ ప్రజలకు ఇబ్బంది వస్తే హీరోలు వెంట‌నే స్పందించ‌డంతో పాటు క‌లిసి క‌ట్టుగా సహాయం చేస్తూ ఉంటారు. క‌లిసి క‌ట్టుగా ఒకే మాట ఒకే బాట అన్న‌ట్టుగా ప్రోగ్రామ్‌లు చేస్తూ ఉంటారు. మ‌న హీరోలు కూడా కొన్నేళ్ల వ‌ర‌కు ఇలాంటి విష‌యాల్లో చురుకు గానే ఉండేవారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వ్య‌క్తిగ‌త స్వార్థాల‌తో పాటు రాజ‌కీయాలు పెరిగి పోవ‌డంతో అస‌లు ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉన్నా లైట్ తీస్కొంటున్నారు.

అయితే ఈ విషయంలో మన హీరోలు తమిళ హీరోలని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మ‌రి మ‌న హీరోలు ఈ విష‌యంలో ఎప్ప‌ట‌కి మార‌తారో ?  ఏమో కాల‌మే ఆన్స‌ర్ చేయాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: