మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ నందమూరి బాలకృష్ణ సినిమాలు చేయడానికి కొంత మంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. చాలా మంది అగ్ర నిర్మాతలు కూడా బాలయ్య బాబు సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ నేపథ్యంలోనే కొన్ని కథలు సిద్ధం చేయించుకునే సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చూస్తుండగా ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

వచ్చే నెల ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేయగా కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురైతే సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా ఆ సినిమా తర్వాత ఆయన ఎవరి తో సినిమా చేస్తాడా అనేది క్లారిటీ లేదు. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా ఒక మెగా హీరో కనబడే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే అది పూర్తి స్థాయి విలన్ పాత్ర కాదని కొంత వరకు మాత్రమే ఉంటుందని కేవలం గెస్ట్ రోల్ మాత్రమే సదరు హీరో చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి ఇంకా ఇటువంటి క్లారిటీ లేకపోయినా దర్శకుడు హీరో కోసం కథ చాలా నీట్ గా రెడీ చేసి పెట్టారని బాలకృష్ణ కూడా అది నచ్చింది అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే మరో కీలక ప్రకటన కూడా రానుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో ఒక మాజీ హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉండవచ్చని కృష్ణా నగర్ వర్గాల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: