మన తెలుగు సినిమా పరిశ్రమలో కథలు రాసే దర్శకులు ఉన్నా సరే చాలా మంది బయోపిక్ విషయంలో ఆసక్తి చూపించే పరిస్థితి ఉండదు. చాలా మంది హీరోలు బయోపిక్ లకు సంబంధించి చాలా వరకు ఆసక్తికరంగా ఉన్న సరే కొనుక్కునే పరిస్థితి ఎదురుకావడంతో కాస్త వెనక్కు తగ్గుతున్నారు అనే మాట వాస్తవం. అగ్ర హీరోలకు బయోపిక్ లకు సంబంధించి మంచి కథలు ఇచ్చినా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడంతో చాలామంది దర్శక నిర్మాతలు మంచి కథలు ఉన్నా సరే ముందుకు రావడం లేదనే సమయం వృధా చేసే ఆలోచన లేదని అంటున్నారు.

ప్రస్తుతం మన తెలుగులో కొన్ని బయోపిక్ లో కి సంబంధించి కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. బయోపిక్ల విషయంలో కొంత మంది అగ్ర నిర్మాతలు ముందుకు వెళ్లేందుకు రెడీ గా కొంత మంది స్టార్ హీరోలు కూడా కథ చాలా బాగుంది రెడీగా ఉన్నారా అని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి బయోపిక్ సంబంధించి మహేష్ బాబు చాలా ఆసక్తి చూపిస్తున్నాడని దీనికి సంబంధించి ఒక కథ కూడా సిద్ధమైందని ఈ సినిమాకు సంబంధించి కృష్ణ కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారని సమాచారం.

ఇక ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశాలు ఉండవని కృష్ణతో కలిసి సినిమాలో మహేష్ బాబు  నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ ఎలా ఉండబోతుంది ఏంటి అని తెలియక పోయినా సూపర్ స్టార్ అనే టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి మహేష్ బాబు కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడమే కాకుండా నమ్రత కూడా కథలో పూర్తిస్థాయిలో సిద్ధం చేయిస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: