నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా కనిపించనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటించాడు. ఈ సినిమా లో బాలకృష్ణ రైతు గా, ఘోర గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలకు జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమా పై ఉన్న అంచనాలను మరింత పెంచాయి. ఇప్పటికే ఈ సినిమా పనులు దాదాపుగా పూర్తి అవడంతో అఖండ సినిమాను డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయబోతున్నారు.

 ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడం తో అఖండ చిత్ర బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను భారీ ఎత్తున చేయాలని నిర్ణయించుకుంది. అందు లో భాగంగా ఈ విషయాన్ని తెలియ జేస్తూ అఖండ చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది, ఈ పోస్టు ద్వారా 27 నవంబర్ సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు శిల్పకళా వేదిక, మాదాపూర్, హైదరాబాద్ లో అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ అఖండ సిని మా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన బోయే  సినిమాలో హీరో గా నటించనున్నాడు ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీ లో కామెడీ దర్శకుడి గా మంచి పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో నటించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: