పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల వైపు దృష్టి మళ్లించి సినిమాలకు కొంత కాలం పాటు దూరం అయ్యారు, ఆ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు కలెక్షన్ లను కూడా బాగానే రాబట్టింది, అయితే ఈ సినిమా ఇచ్చిన జోష్ లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాగర్ కే చంద్ర దర్శకత్వం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందిస్తున్న భీమ్లా నాయక్ సినిమాతో పాటు విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.

ఈ రెండు సినిమా లలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ ను పవన్ కళ్యాణ్ శర వేగంగా పూర్తి చేస్తున్నాడు, ఇప్పటికే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న భీమ్లా నాయక్ సినిమా అవుట్ ఫుట్ మీద పవన్ కళ్యాణ్ అంతగా సంతృప్తి చెందక పోవడం తో తిరిగి మళ్ళీ కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ రీ షూట్ కోసం దాదాపు 40 రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కొంత భాగం రీ షూట్ కూడా ముగిసినట్లు తెలుస్తోంది, ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా మరో హీరోగా కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: