పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సినీ ఇండస్ట్రీ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సినిమాల నుంచి రాజకీయాల వైపు పవన్ కళ్యాణ్ మళ్ళీ కొంతకాలం తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ  ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ నటించిన సినిమా 'వకీల్ సాబ్'. ఈ సినిమా పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. అంతే కాదు సరైన సమయంలో సరైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్ .ఈ సినిమా ఓ సామాజిక కథాంశంతో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆడవాళ్లకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనే లాయర్ గా పవన్ కళ్యాణ్ కనిపించిన సంగతి తెలిసిందే. నిజానికి ఆడవాళ్ల ఇలాగే ఉండాలి.

ఇలాంటి దుస్తులను ధరించాలి. ఆడవాళ్ళ మాత్రమే సాంప్రదాయానికి కట్టుబడి ఉండాలి. ఇలాంటివి తరతరాలుగా కొనసాగుతూనే వస్తున్నాయి. ఆడవారికైనా మగవారికైనా అవునంటే అవును అని కాదంటే కాదని ఒకే అర్థం ఉంటుంది. కానీ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే ఆడవారికి ఆ హక్కు లేనట్లుగా కనిపిస్తోంది. ప్రేమ, స్నేహం, శారీరక సంబంధం, వివాహం వంటి పలు విషయాలపై మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఈ సినిమా ప్రశ్నిస్తుంది. ఆ దాడులలో కొంత మంది ప్రాణాలు కోల్పోతే మరికొంతమంది తీవ్రమైన మానసిక వేదన తో పాటు శారీరక హింసను అనుభవిస్తూ..

జీవితాలను వెళ్లదీస్తున్నారు అనే ఈ విషయాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది. అసలు ఇలాంటి పరిస్థితులు ఆడవాళ్ళకు ఎందుకు వస్తున్నాయనే విషయాలను లోతుగా పరిశీలిస్తోంది ఈ సినిమా. ఆడవాళ్ళకు జరిగే అన్యాయాల పట్ల ప్రతి ఒక్కరికి ఆలోచన కలిగించేలా ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు కచ్చితంగా రావాలి. సినిమాల ద్వారా మార్పు వస్తుంది అంటే ఈ సినిమాతో కనీసం కొంత మందిలో అయినా ఆలోచన కలుగుతుంది. ఒక రకంగా చూసుకుంటే ఈ సామాజిక కోణంలో 'వకీల్ సాబ్' పవన్ కి ది బెస్ట్ సినిమా అని చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: