జూనియర్ ఎన్టీఆర్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఈ మధ్యకాలంలో పోటీ పడటమే కాకుండా అతని కోసం మంచి మంచి కథలు సిద్ధం చేసుకుని ముందుకు వస్తున్నారు అనే మాట అక్షరాలా నిజం. ఈ మధ్య కాలంలో కొంతమంది పెద్ద దర్శకులు అలాగే కొంతమంది దర్శకులు కూడా జూనియర్ ఎన్టీఆర్ కోసం మంచి కథను సిద్ధం చేసుకొని ఆయనకు టిక్కెట్ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఒక సినిమా చేస్తుండగా ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేసే సినిమా ఏంటి అనే దానికి సంబంధించి క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం యూరప్ టూర్ లో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ టూర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఒక సర్ప్రైజ్ అభిమానులకు వచ్చే అవకాశం ఉందని యూరప్ టూర్ కి సంబంధించిన అనేక విశేషాలను తన అభిమానులతో జూనియర్ ఎన్టీఆర్ పంచుకునే అవకాశం ఉండవచ్చని సమాచారం.

దీనికి సంబంధించి ప్రతి వీడియో కూడా షూట్ చేస్తున్నాడు అని లక్ష్మీప్రణతి షూటింగ్ కి సంబంధించి కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఈ షూటింగ్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సలహాలు ఇవ్వడమే కాకుండా ఒక దర్శకుడు సలహాలు తీసుకునే దీనికి సంబంధించి ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ తో వీడియోని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. 20 నిమిషాల ఈ వీడియోని అభిమానుల కోసం జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని త్వరలోనే దీనికి సంబంధించి ఒక ట్రైలర్ లాంటిది కూడా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: