తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్యకాలంలో రాజమౌళి చేసిన సినిమాలకు సంబంధించి చిన్న వార్త వచ్చినా సరే దాని గురించి జరిగే చర్చ అంతా ఇంతా కాదు. చిన్న వార్త వచ్చినా సరే అభిమానులు దానికి సంబంధించి ఎన్నో కథనాలు ఎన్నో స్టోరీ లు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ అలాగే మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు దర్శకత్వంలో ఒక సినిమా చూస్తూ ఉండగా ఆ సినిమాకు సంబంధించి కథ ఎలా ఉంటుంది హీరోయిన్ ఎవరు విలన్ పాత్ర ఎవరు పోషిస్తారు అనే దానిపై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి దాదాపుగా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకునే అవకాశం ఉండవచ్చని సమాచారం. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని ఒక హీరోయిన్గా దీపికా పదుకొనే మరో హీరోయిన్ గా కొత్త హీరోయిన్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఇద్దరు ప్రముఖ హీరోయిన్ లతో ఐటమ్ సాంగ్ చేయించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను 2024 చివరికి విడుదల చేసేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశం ఉందని అయితే మహేష్ బాబు మాత్రం ఏడాదిలో సినిమాలు పూర్తి చేయాలని తాను ఇతర సినిమాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా రాజమౌళిని కోరినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎంత వరకు ముందుకు రాబోతుంది ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. రాజమౌళి ప్రస్తుతం రెండు సినిమాలు మీద ఎక్కువగా దృష్టి పెట్టి వాటికి నిర్మాణ సారథ్యం వహించే ప్రయత్నం కూడా చేస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: