హాట్ బ్యూటీ రెజీనా కసాండ్ర  శివ మనసులో శృతి (sms) అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాలో సుధీర్ బాబు హీరో గా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు పర్వాలేదు అనిపించుకున్నప్పటికి, ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడడంతో టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. అందులో భాగంగా పవర్, రారా కృష్ణయ్య, కొత్త జంట, జో అచ్యుతానంద, శౌర్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం వంటి పలు చిత్రాలలో నటించిన ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పడుతుంది. ఈ మధ్య కూడా పాన్ ఇండియా సినిమా గా విడుదల అయిన  తాలైవి సినిమాలో రెజీనా నటించింది.

ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న బ్రేకింగ్ న్యూస్ సినిమా షూటింగ్ తాజా గా హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకు సుబ్బు వేదుల దర్శకత్వం వహించబోతున్నాడు. బ్రేకింగ్ న్యూస్ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మూడో వారం వరకు జరగబోతున్నట్లు తెలుస్తోంది. రా ఎంటర్ టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించబోతున్నట్లు బ్రేకింగ్ న్యూస్ చిత్ర బృందం తెలియజేస్తున్నారు. వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు మరి కొన్ని రోజుల్లో తెలియజేస్తాము అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకు ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, ఈశ్వర్ ఎలుమహంతి సినిమాటో గ్రాఫర్ గా చేస్తున్నారు. ఈ సినిమాతో రెజీనా కసాండ్ర  ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: