టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కి ఓ ప్రత్యేకమైన స్దానం ఉంది. ఎటువంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి.. ఇంతటి పేరు సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. ఆయనను స్పూర్తిగా తీసుకుని సినీ ఇండస్ట్రీలోకి హీరో గా అడుగుపెట్టిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇక ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలో నటించారు. కానీ కొన్ని చిత్రలు ఆయన కెరీర్ ని మలుపు తిప్పాయి. అలాంటి సినిమాలో చిరంజీవి నటించిన "విజేత" సినిమా కూడా ఒకటి.

సినిమా ఎంతో మంది సెలబ్రిటీలకు కూడా ఫెవరేట్ సినిమా కావడం విశేషం. ఇక కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి నటనకు విమర్శకులు కూడా ఆయనను ప్రశంసించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా భానుప్రియ నటించింది. తెర పై వీరిద్దరి జంట అప్పట్లో సెన్సేషన్ గా మరింది. ఇక  ఈ విజేత సినిమాని గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మించారు.  ఈ సినిమా 1985 అక్టోబరు 23న విడుదలై..కలెక్షన్ పరంగాను బాక్స్ ఆఫిస్ ను షేక్ చేసింది.   అప్పటి వరకు  మాస్ కథలనే చేసుకుంటూ వెళ్తున్న చిరంజీవికి విజేత సినిమా క్లాసిక్ లుక్ ని తీసుకొచ్చిందనే చెప్పాలి. నిజం చెప్పాలంటే అప్పటివరకు చిరంజీవి ఎన్ని సినిమాలు చేసిన..ఈ సినిమానే ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గర చేసింది.   చిరంజీవి నటించిన టాప్ టెన్ చిత్రాలలో ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఉంటుంది.

కాగా ఈ సినిమా రిలీజ్  అయ్యి 36 ఏళ్లు కావస్తుంది. ఇప్పుడు ఈ సినిమా కి రిమేక్ చేయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకి ఈ సినిమాని రీమేక్ చేయాలి అనుకుంటుంది ఎవరో తెలుసా..ఇంకెవరు మెగాస్టార్ చిరంజీవినే. యస్.. ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి..చిరంజీవి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన " విజేత" సినిమాని రిమేక్ చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి  ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల లిస్టులో ఇది కూడా ఒకటి అన్నట్లు తెలుస్తుంది. మ‌రి 36 ఏళ్ల ముందు వ‌చ్చిన ఈ సినిమాకు కొన‌సాగింపుగా ఇప్పుడు ఎలాంటి క‌థ రెడీ చేసి సినిమా తీస్తారో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: