టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు హీరోలు ఎంతో హుషారుగా ఉన్నారు. గతంలో సంవత్సరానికి ఒక్క సినిమా మాత్రమే చేసే వీరు ఇప్పుడు ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టులను ఓకే చేసి ఒకేసారి ఆ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.   ఒకరిని చూసి మరొకరు ఈ విధంగా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు కొన్ని సినిమాలను ఒప్పుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటన్నారు. మరి మన హీరోలు ఎవరు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నరో ఇప్పుడు చూద్దాం.

పాన్ ఇండియా స్టార్ గా టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి మొట్ట మొదటగా భారీ గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన చేసిన రాధే శ్యామ్ చిత్రం విడుదల కు సిద్దంగా ఉండగా సలార్ మరియు ఆదిపురుష్ సినిమాలను ఒకేసారి షూటింగ్ చేస్తూ ఆ సినిమాలను పూర్తి చేసే స్థాయికి తీసుకు వచ్చాడు. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట కే మరియు సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలను ఒకేసారి షూటింగ్ చేసే విధంగా ప్లాన్ చేశాడు. ఇక ప్రభాస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఏకంగా మూడు సినిమాలను ఒకే సారి షూటింగ్ చేస్తున్నాడు.

గాడ్ ఫాదర్  భోళా శంకర్ వాల్తేరు వీరన్న సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ప్రణాళిక వేసుకున్నాడు. ఇప్పటికే తొలి రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక మాస్ రాజా రవితేజ కూడా మూడు సినిమా లను లైన్ లో పెట్టాడు. కిలాడి సినిమా ఫిబ్రవరి లో విడుదల అవుతుండగా రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాకా చిత్రాలను ఒకేసారి పూర్తి చేయనున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా శంకర్ సినిమాను పూర్తి చేయగానే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోయే సినిమాను కూడా పూర్తి చేసి తన తదుపరి సినిమాకి వెళ్లాలని భావిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: