నందమూరి తారక రామారావు మనవుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి .. తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు జూ.ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఈయన చేసిన సినిమా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా కొన్ని రోజులు లేట్ అయ్యింది. ఆ తరువాత కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ..ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా చేస్తున్నప్పుడే మరో రెండు ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టాడు తారక్.

తనకు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల్ శివ తో ఓ సినిమా చేస్తున్నా అని అప్పుడెప్పుడో అనౌన్స్ చేసాడు తారక్. ఇక ఈ సినిమా 2022 లో సెట్స్ పైకి వెళ్లనుంది. సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు చాలా మందినే ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ లిస్ట్ లో మాత్రం కొందరే ఉంటారు. వాళ్లల్లో  కొరటాల శివ కూడా ఒకరు. వీళ్లిద్దరు ఎంత మంచి జాన్ జిగిడి దోస్త్ లు అన్న విషయం అందరికీ తెలిసిందే. నిజం చెప్పాలంటే కొరటాలకు రచయితగా అవకాశం ఇచ్చిందే తారక్ నే. కాజల్,సమంత లు హీరోయిన్లుగా ఎన్టీఆర్ హీరో గా తెరకెక్కిన చిత్రం ‘బృందావనం’కు మాటలు రాసిందే కొరటాల శివనే. ఈ సినిమా ద్వారానే అయన స్టార్ హీరోల కళ్లలో పడ్డారు.  అనీ సెట్ అయ్యుంటే దర్శకుడిగా కొరటాల తొలి చిత్రం ఎన్టీఆర్‌తోనే చేయాల్సింది కానీ.. తారక్ అప్పటికే వెరే సినిమాల్లో బిజీగా ఉండడంతో డేట్లు సర్దుబాటు చేయలేక ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.

ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు  వీళ్లిద్దరూ కలిసి ‘జనతా గ్యారేజ్’ అనే సినిమా చేశారు. ఆ సినిమా ఎంత  బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటేనే ఆ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫిస్ ను షేక్ చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో  ఎన్టీఆర్.. తన ఫ్యూచర్ సినిమాల  గురించి మాట్లాడుతూ కొరటాల సినిమా స్టోరీ లైన్ ను చెప్పేసాడు.  "కొరటాలతో చెయ్యబోయే సినిమా 2022 ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్తుందని.. ఇది ఒక రివెంజ్ డ్రామా అని చెప్పేసాడు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ ను ఏడు నెలల్లో  పూర్తి చేసి..మరో సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నా" అంటూ తారక్ క్లారిటీ ఇచ్చాడు.  మరి చూడాలి   వీళ్లిద్దరి రివెంజ్ డ్రామా ఎలా ఉంటుందో ..?

మరింత సమాచారం తెలుసుకోండి: