ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ బ‌డ్జెట్ సినిమా ఆర్ ఆర్ ఆర్‌.  ఈ సినిమాను డీవీవీ ఎంట‌ర్టైన్ మెంట్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ ను రాజ‌మౌళి ఏకంగా పాన్ ఇండియా స్టార్ చేసేశాడు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ప్ర‌భాస్ ను కూడా ప్ర‌మోష‌న్ల‌కు తీసుకు వ‌స్తే ఎలా ?  ఉంటుందా ? అన్న చ‌ర్చ‌లు అయితే ఆ సినిమా వ‌ర్గాల్లో న‌డుస్తున్నాయ‌ట‌.

రాజ‌మౌళి కూడా ప్ర‌భాస్ ను నార్త్‌లో ప్ర‌చారానికి దింపాల‌ని చూస్తున్నాడ‌ట‌. ప్ర‌భాస్ తో చ‌ర‌ణ్‌,  ఎన్టీఆర్ ఇంట‌ర్వ్యూలు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ప్ర‌భాస్ ను కొన్ని సినిమాల ప్ర‌మోష‌న్ల‌కు వాడుతున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు తాజా సినిమా రొమాంటిక్ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు ప్ర‌భాస్ ను వాడారు. ప్రభాస్సినిమా హీరో, హీరోయిన్ల‌తో ఒక ఇంట‌ర్వ్యూ ప్లాన్ కూడా చేశారు. ఆ ఇంట‌ర్వ్యూ తోనే సినిమాకు కావాల్సినంత ప్ర‌మోష‌న్ జ‌రిగి సినిమా ప్లాప్ అయినా బ్రేక్ ఈవెన్ అయ్యింది.

అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ప్ర‌మోష‌న్ల కు కూడా ప్ర‌భాస్ ను తీసుకు వ‌స్తే సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌నే అంటున్నారు. అయితే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ , మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇగో హ‌ర్ట్ అవ్వ‌కుండా చూస్తే .. ప్ర‌భాస్ ప్ర‌మోష‌న్ల‌కు వ‌చ్చినా ఇబ్బంది ఉండ దంటున్నారు. ఈ ఇద్ద‌రి హీరోల ఇగోలు హ‌ర్ట్ కాకుండా చూడాల్సిన బాధ్య‌త రాజ‌మౌళి పై ఉంది. బాహుబ‌లి ఇమేజ్ ను క్యాష్ చేసు కోవాల‌నుకుంటే ప్ర‌భాస్ ను ఖ‌చ్చితంగా ఆర్ ఆర్ ఆర్ ప్ర‌మోష‌న్ల కు దింపాల్సి ఉంటుంది. మ‌రి రాజ‌మౌళి ఏం చేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: