ప్రస్తుతం సీనియర్ హీరోలు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. చిరంజీవి దగ్గర నుంచి రవితేజ వరకు అందరూ కూడా 50 సంవత్సరాలకు పై బడిన హీరో లేకపోవడం గమనార్హం. అయితే ఈ వయసులో కూడా వారు యాక్షన్ సినిమాలను చేస్తూ వయసుతో సంబంధం లేకుండా భారీ యాక్షన్ సీక్వెన్స్ లలో పాల్గొంటున్నారు. ఈ విధంగా యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా వీరు చేస్తున్న ఈ ఫీట్లు భవిష్యత్తు వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఏళ్లు గడుస్తున్నా అరవై సంవత్సరాల వయసు వచ్చినా కూడా చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి వారు మాస్ చిత్రాలను చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మన సీనియర్ హీరోలు చేస్తున్న మాస్ మసాల చిత్రాలు చూస్తుంటే యంగ్ హీరోలతో సైతం దిమ్మతిరిగిపోతుంది అని చెప్పవచ్చు. బాలకృష్ణ ఇప్పటికే అఖండ అలాంటి భారీ మాస్ చిత్రంలో నటించగా రాబోయే చిత్రం లో కూడా ఈ మాస్ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా  బాలకృష్ణ ఈ వయసులో ఇంతలా కష్టపడటం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి ఏకంగా నాలుగు మాస్ మసాల చిత్రాలు చేయడం మాత్రమే కాకుండా ఒకేసారి ఆయా సినిమా షూటింగులలో పాల్గొనడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గాడ్ ఫాదర్ భోళా శంకర్ వాల్తేరు వీరన్న వంటి చిత్రాలతో మెగాస్టార్ చిరంజీవి మరొకసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. అక్కినేని నాగార్జున కూడా సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజు సినిమా లో నటిస్తున్నాడు.  మరొకవైపు ఘోస్ట్ అనే థ్రిల్లర్ సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ ఇటీవల నారప్ప సినిమాతో మాస్ హిట్ కొత్తగా ఇప్పుడు దృశ్యం 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే f3 సినిమా కూడా త్వరలో విడుదల కాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: