ఒక హీరో ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ ఉండడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాము. అందరికంటే ఎక్కువగా నటీనటులు మాత్రమే ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ సినిమాలను చేస్తూ ఉంటారు. అయితే ఇది దర్శకుల విషయంలో మాత్రం ఎక్కువ సందర్భాలలో సాధ్యపడదు. ఎందుకంటే ఒక సినిమా మీద పెట్టిన ఫోకస్ మరో సినిమాకి మార్చితే ఆ రెండు సినిమాల పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఒక సినిమా పూర్తయిన తర్వాతనే వారు మరొక సినిమా జోలికి వెళతా రు.

అలా ఇప్పటివరకు చాలా మంది దర్శకులు ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ దశలో ఉన్న సినిమాలను వదిలేసి తదుపరి సినిమాకు వెళ్లారు కానీ షూటింగ్ నిర్మాణం లో ఉన్న సినిమాల ను వదిలేసి ఏనాడు కూడా షూటింగులకు వెళ్ళలేదు. ఆ విధంగా ఇప్పుడు ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ సందీప్ వంగ తాను ప్రస్తుతం చేస్తున్న యానిమల్ సినిమా షూటింగ్ తో పాటే ఇటీవల ప్రభాస్ హీరోగా అనౌన్స్ చేసిన స్పిరిట్ సినిమాను కూడా చేసే విధంగా ప్రణాళికలు వేస్తున్నాడు. 

అర్జున్ రెడ్డి సినిమా తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు సందీప్ వంగా. ఈ క్రమంలోనే ఆయన హిందీ లో కబీర్ సింగ్ గా ఆ చిత్రాన్ని తెరకెక్కించి అక్కడ తొలి చిత్రంతోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. రణభీర్ కపూర్ హీరోగా ప్రస్తుతం యనిమల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఆయన ప్రభాస్ తో చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ రాగా ఆ చిత్రాన్ని తొందరగా తెరకెక్కించాలని ప్రభాస్ నుంచి వత్తిడి వస్తుండగా ఈ సినిమా చేస్తున్న సమయంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని సందీప్ భావిస్తున్నాడట. మరోవైపు ప్రభాస్ కూడా ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: