కరోనా సమయంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఎంతటి ఇబ్బంది కలిగిందో అందరికీ తెలిసిందే. సినిమాలు విడుదల కాకపోవడం షూటింగులు కూడా పోస్ట్ పోన్ కావడం తో ఒక్కసారిగా అందరూ ఏం చేయాలో పాలుపోని పరిస్థితి లోకి వెళ్ళిపోయారు. పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్నా చితకా ఆర్టిస్టుల దాకా సినిమాలను అన్ని పక్కన పెట్టేసి బ్రతకడం కోసం ఎంతగానో శ్రమించారు. అయితే వీటి వల్ల వచ్చిన దానికంటే పోగొట్టుకున్నది చాలా ఎక్కువనే చెప్పాలి. ఓ వైపు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఎవ్వలేకపోతున్నమనే బాధ వారిలో ఉండగా ఎక్కడ కరోనా ఎటాక్ అవుద్దో అన్న సందేహం కూడా వారిలో ఉంది. ఏదేమైనా మన హీరో లు ప్రేక్షకులను ఆనందంగా ఉంచడానికి చాల ప్రయత్నంలు చేశారు. 

అంతకు ముందు మన హీరోలు ఒక్కొక్కరు రెండేసి మూడేసి సినిమాలను చేస్తూ రెండు చేతుల సంపాదించే వారు. ఇప్పుడు బాగా ఉన్న సమయంలో పోగొట్టుకున్న దాన్ని తిరిగి రాబట్టుకోవడానికి ఏకంగా నాలుగు సినిమాలు చేస్తూ ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇదే టైమ్ లో టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్  కూడా ఎక్కువ అయింది. దీన్ని ఉపయోగించుకోవాలని అందరూ హీరోలు భావిస్తున్నారు. దాంతో వరుస సినిమా షూటింగ్ లు చేస్తూ మన హీరోలు దూసుకు పోయేలా చేస్తున్నారు.

రవితేజ ఎన్టీఆర్ అల్లు అర్జున్ నాని మహేష్ ఎన్టీఆర్ నాగ చైతన్య వంటి హీరోలు ఇప్పుడు మరో రెండేళ్ల దాకా కాళీగా లేరు. కరోనా సమయంలో వీరు కోల్పోయినదంతా ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేస్తూ బ్రదర్ అల్లు అర్జున్ బోయపాటి శ్రీను తో చేస్తున్నారు ఈ నేపథ్యంలో వీరందరూ కరోనా సమయంలో పోయిన దాని కంటే ఎక్కువే ఇప్పుడు సంపాదించబోతున్నారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: