సీమ ప్రజలపై సినిమాలు, కోట్లు పోగేసుకున్న సినీ ప్రముఖులు. ఇపుడు వరుస వర్షాలు కురిసి వరద ప్రవాహలతో అక్కడి జనాలు ఆందోళన చెందుతుంటే తన చిత్రాలలో సీమ జనుల కష్టాల గురించి, వారికి సహాయం అందించాలని, అండగా నిలవాలని భారీగా డైలాగులు చెప్పిన పలువురు సినీ తారలు నేడు ఈ విపత్కర సమయంలో ఏమయ్యోరో అర్దం కావడం లేదు. అంటే ఆ భారీ ఆదర్శ డైలాగులన్నీ సినిమాలు వరకే , దాంతో వారి చిత్రాలను విజయవంతం చేసేందుకే అన్న వైఖరి ఇపుడు కళ్ళ ముందు కనిపిస్తోంది. ఈ విషమ పరిస్థితుల్లో సినీ పరిశ్రమ నుండి ఎవరూ రాయలసీమ ప్రజల ఎమోషన్స్ ని క్యాష్ చేసుకున్న మీకు నేడు వారు, వారి ఆర్తనాదాలు కనీసం వినబడుట లేదా అని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

నిజమే కదా ఫ్యాక్షనిజం అంటే రాయలసీమ అని ముద్ర వేసిన ఘనత చిత్రసీమకే దక్కుతుంది. ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకుని లాభాలను కుమ్మరించాయి. మరి అందుకు మూలమైన రాయలసీమ ప్రాంత ప్రజలకు సహాయం చేయాల్సిన బాధ్యత వారికీ ఉంది అంటూ మరికొందరు అంటున్నారు. ఇక అటు ప్రభుత్వం నుండి సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ తుఫాను ధాటి నుండి ఇంకా కోలుకొనే లోపు అప్పుడే మరో పెను తుఫాను పొంచి ఉంది అన్న సూచనలు ప్రజల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

తెలుగు చిత్ర పరిశ్రమ వ్యాప్తి ఎంత దూరమో తెలిసిందే. సినిమాలలో పేజీలకు పేజీలు నీతి వాఖ్యాలు, డైలాగులు చెప్పడం కాదు. నిజంగా సమస్య ఉన్నప్పుడు మీరు ముందుకు వచ్చి కాస్త సాయం చేస్తే ఈ రాయలసీమ మిమ్మల్ని కలకాలం గుర్తుంచుకుంటుంది. ఇకనైనా కదలండి రాయలసీమ ప్రజలను ఓదార్చి మీ ఔదార్యాన్ని చూపించండి అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రజలు మీడియా వర్గాలు వేడుకుంటున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: