టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కేవలం హీరోగానే కాకుండా..హోస్ట్ గా కూడా తానేంటో ప్తూవ్ చేసుకున్నాడు. స్టార్ మా లో వచ్చిన తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో అయిన్ బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా చేసి అందరి ఆశ్చర్యపరిచాడు. అప్పటికే స్టార్ హీరోగా ఉన్నటుంవంటి తారక్ బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా వ్యవహరించడంతో షో కి విపరీతమైన పబ్లీసిటీ వచ్చేసింది. ఇక షో స్టార్ట్ అయ్యాక తారక్ చేసిన హడావిడి, హౌస్ మేట్స్ తో చేసిన అల్లరి, వీకెండ్స్ లో వచ్చి తారక్ ఇంట్లో వాళ్లు చేసిన తప్పులను కరెక్ట్ చేయడం. అబ్బో షో చూసేవాళ్లు భళ్లే ఎంజాయ్ చేసారులే. మధ్యలో ఓ సారి తారక్ హౌస్ లోపలికి వెళ్లి బిర్యాని కూడా చేసారు. అప్పట్లో ఆ షో TRP రేటింలో ముందు ఉండేది.

ఇక ఆ తరువాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు జెమినీ టీవీలో ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు  అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు తారక్. ఈ షో లో తారక్ మాట్లాడే విధానం, హాట్ సీట్ లో కూర్చున్న వారిని అడిగే ప్రశ్నలు..మధ్య మధ్యలో తారక్ వాళ్లతో చేసే అల్లరి. తెర పై చూడటానికి ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఇక ఈ షోకి బడా సెలబ్రిటీస్ కూడా వచ్చారు. మొదటి ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ చరణ్ రాగా ఆ తరువాత రాజమౌళి, కొరటాల శివ, సమంత, ఇలా టాప్  స్టార్స్  కూడా వచ్చి తారక్ తో కలిసి గేం ఆడి సందడి చేసారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. యస్.. ఇప్పుడు ఈ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు షోకి టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు గెస్ట్ గా వచ్చారు.

ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ త్వ‌ర‌లోనే టెలీకాస్ట్ కానుంది అంటూ జెమినీ టీవీ అధికారింగా తెలియజేస్తూ ప్రోమో రిలీజ్ చేసారు. ప్రోమోలో మ‌హేష్ బాబుని తారక్  షోలోకి ఆహ్వానిస్తూ  అన్నా అంటూ కౌగిలించుకోవడం మనం ప్రోమోలో క్లీయర్ గా చూడవచ్చు. ఇక అంతేకాదు  వీళ్ల మధ్య చాలా ఫన్నీ మాటాలు నడిచాయని టాక్ వినిపిస్తుంది. తార‌క్ కూడా ట‌ఫ్ క్వ‌శ్చ‌న్స్‌తో హాట్ సీట్ లో ఉన్న మ‌హేష్‌ను ఓ ఆటాడుకున్నాడట. ఇక  ఈ టైంలో మ‌హేష్‌బాబు ఓ ప్ర‌శ్న‌కు జవాబు కోసం  వీడియో కాల్ ఫ్రెండ్ ఆప్ష‌న్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక  ఆ ఫ్రెండ్ ఎవరో కాదు టాలీవుడ్ పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను చూస్ చేసుకుని ప‌వ‌న్ దగ్గర నుండి ఆన్సర్ తీసుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట మారుమ్రోగిపోతుంది. ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: