టీవీ నటి, రాజకీయవేత్త స్మృతి ఇరానీకి అవమానం ఎదురైంది. ఆమె షూటింగ్ లో పాల్గొనడానికి ఓ పాపులర్ షో కోసం సెట్ కు వెళ్లగా ఆమెను సెక్యూరిటీ గార్డు లోపలికి అనుమతించలేదు. స్మృతి... కపిల్ శర్మ షోలో అతిథిగా కనిపించాల్సి ఉంది. కానీ ఇప్పుడు అది జరిగేలా కన్పించడం లేదు. స్మృతి షూటింగ్ చేయకుండానే ఇంటికి తిరిగి రావడం సంచలనంగా మారింది. స్మృతి ఇరానీ తన 'లాల్ సలామ్' పుస్తకం ప్రమోషన్ కోసం ఇక్కడికి రావాల్సి ఉండగా, గార్డులు ఆమెను లోపలికి అనుమతించలేదు. చివరకు చేసేది లేక స్మృతి ఇరానీ వెళ్లిన దారినే తిరిగి రావాల్సి వచ్చింది.

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం షూటింగ్ కోసం కేంద్ర మంత్రి స్మృతి సెట్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నప్పుడు, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు అన్నా ఆమెను గుర్తించలేకపోయాడు. సెట్స్‌లో ఎపిసోడ్‌ని షూట్ చేయడానికి తనను ఆహ్వానించారని స్మృతి అతనికి చెప్పింది. ఆమె ఈ షోకి ప్రత్యేక అతిథి. దానికి గార్డు 'మాకు ఎలాంటి ఆర్డర్ రాలేదు, క్షమించండి మేడమ్, మీరు లోపలికి వెళ్లలేరు' అని చెప్పాడట. అయితే ఇదంతా స్మృతి ఇరానీ డ్రైవర్, కపిల్ శర్మ షో గేట్ కీపర్ మధ్య ఈ అపార్థం జరిగిందని చాలా మంది చెబుతున్నారు. అయితే ఈ విషయం కపిల్ మరియు అతని ప్రొడక్షన్ టీం తెలియగానే సెట్స్ లో గందరగోళం నెలకొంది.

కాగా ఇటీవల స్మృతి ఇరానీ చాలా బరువు తగ్గింది. 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ'తో పాపులారిటీ సంపాదించుకున్న స్మృతి ఇరానీ ఇప్పుడు కాస్త స్లిమ్‌గా మారిపోయింది. ఆమె ముందు, తరువాత చిత్రాలు వైరల్ అవుతున్నాయి.  'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ'లో స్మృతి ఇరానీ 'తులసి' పాత్రను పోషించింది. ఈ ఒక్క షో స్మృతికి టీవీ ప్రపంచంలో చాలా ప్రేమను, గుర్తింపును ఇచ్చింది. ఏక్తా కపూర్, స్మృతి ఇరానీ కూడా అప్పటి నుండి స్నేహితులయ్యారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: