జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు సుమారు 60 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది ఇక ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివతో చేస్తుండగా దాని తర్వాత ఎన్టీఆర్ 31వ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత 32వ సినిమా మహానటి డైరక్టర్ నాగ్ అశ్విన్ తో చేయనున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు అశ్విన్ ప్రభాస్ మహానటి సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకొని ఈ సినిమాతో మళ్ళీ ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో  వైజయంతి బ్యానర్ లో  ప్రాజెక్ట్ K తెరకెక్కుతుంది. ఈ సినిమాలో లో ఎన్టీఆర్ కు జతగా దీపిక పడుకొని నటించనున్నారు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో దీపిక పడుకొనే ఎన్టీఆర్ ల తో పాటు అమితాబచ్చన్ కూడా కనిపించడం విశేషం. ఇకపోతే దర్శకుడు నాగ్ అశ్విన్ ఎన్టీఆర్ తో కలిసి ఎలాంటి సినిమా తీస్తాడు ఏ రేంజ్ లో తీస్తాడు అనేదాని గురించి చర్చలు జరుపుతున్నారు. 

నాగ్ అశ్విన్ మహానటి సినిమా ను ఏ రేంజ్ లో  తెరకెక్కించాడు అందరికీ తెలుసు. అయితే ఈ దర్శకుడు ఎన్టీఆర్ తో జతకట్టి మైథలాజికల్, లేదా సోసియో ఫాంటసీ సినిమా తీయని ఉన్నాడని అప్పుడే ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే ఎన్టీఆర్ నటించిన rrrసినిమా తర్వాత తన 30 31వ సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా రానుంది. ఎన్టీఆర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా మీద భారీగానే అంచనాలు పెంచుకున్నారు వీరి ఫ్యాన్స్. మరి వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో వేచిచూడాల్సిందే మరి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: