స్టార్ హీరో సినిమాలు అంటే ఎక్కువగా.. ఇంట్రడక్షన్ లో భారీ ఫైట్ సీన్లు, ఇంటర్వెల్ వద్ద భారీ ఫైట్ సీన్ లను సెట్ చేస్తూ ఉంటారు మన డైరెక్టర్ లో. అది కూడా చాలా పవర్ ఫుల్ డైలాగ్ లతో కథను రెడీ చేసుకుని ఉంటారు. ఇక ఆ తర్వాత స్టోరీ అంత ఎమోషనల్, కామెడీ వంటి సీన్లతో చివరిగా ఎండ్ కార్డు ఇలాంటి కాన్సెప్టు తోనే ఎన్నో సినిమాలు రావడం జరిగాయి. ఇలాంటి కథలకు జనాలు బాగా అలవాటు పడిపోయారు. అలాంటి సమయంలోనే డైరెక్టర్ కోడి రామకృష్ణ ఒక విభిన్నమైన కథతో సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఆ సినిమా గురించి ఇప్పుడు చూద్దాం.

మొదటిసారిగా కోడి రామకృష్ణ తన సినిమా మొత్తం గ్రాఫిక్స్ తోనే తెలుగు ప్రేక్షకులను మైమరిపించే లా చేసాడు. ఆ సినిమానే అమ్మోరు. ఈ సినిమాలో హీరోగా సురేష్ సౌందర్య ముఖ్యమైన పాత్రలో నటించారు. రమ్యకృష్ణ కూడా ఈ సినిమాలో ఒక భాగమని చెప్పవచ్చు. ఈ మూవీలో విలన్ గా రామిరెడ్డి, బాబు మోహన్ వంటి వారు ఎంతో అద్భుతంగా తమ నటనని పండించారు. ఈ సినిమా 1995 లో నవంబర్ 23 వ తేదీన ఎటువంటి ఆర్భాటాలు లేకుండా విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదల అయినప్పటికీ ఇలాంటి కలెక్షన్లను రాబట్ట లేదు.

కానీ మరుసటి రోజు నుంచి ఈ సినిమా థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ తో నిండిపోవడంతో సినీ ఇండస్ట్రీ లో ఉండే నిర్మాతలు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక ఒక కొత్తదనం వచ్చింది అనే విధంగా సంబరపడిపోయారు. ఈ సినిమాకి నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి వహించారు. అయితే ఈ సినిమా చేసే ముందు కూడా కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ.. ఈ సినిమా నీ 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా పూర్తయ్యే సరికి 11 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: