మెగాస్టార్ జోరు పెంచేశారు. వీలైనన్ని సినిమాలు చేసుకుంటూ పోవాలని డిసైడ్ అయ్యారు. తనతో పనిచేయని దర్శకులకు, నిర్మాతలకు ఆయన అవకాశం ఇస్తున్నారు. మంచి కధతో వస్తే చాలు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.

అలాంటి మెగాస్టార్ తో అలనాటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ తీయాలని ఒక నిర్మాత చూస్తున్నారని టాక్. ఆయన ఎవరో కాదు ఎన్టీయార్ కధానాయకుడు మూవీని బాలయ్యతో తీసిన ఇందూరి విష్ణు. ఆయన మెగాస్టార్ ని కలసి తనకు ఒక సినిమా చేసిపెట్టమని అడిగారని టాక్. అది కూడా చిరంజీవి విజేత మూవీకి సీక్వెల్ గా సినిమాట.

ఈ మూవీని గీతా ఆర్ట్స్ వారు తీశారు. ఈ మూవీ 1985 ప్రాంతంలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీతో చిరంజీవిలోని ఉత్తమ నటుడిని అంతా చూశారు. కుటుంబం కోసం తాను త్యాగం చేసే పాత్రలో అద్భుతమైన నటనను మెగాస్టార్ చేశారు. యువకుడిగా ఉన్న టైమ్ లోనే చిరంజీవి ఇంతటి మహత్తరమైన పెర్ఫార్మెన్స్ చూపించారు.

సినిమా ఈ రోజుకీ టీవీల్లో వస్తే జనాలు అట్రాక్ట్ అవుతారు. అలాంటి మూవీకి సీక్వెల్ అంటే నిజంగా రిస్క్ గానే చూడాలి. పైగా ఆ మూవీలో హీరో కుటుంబం కోసం త్యాగం చేస్తాడు. అక్కడితో కధ అయిపోయింది. మరి దానికి సీక్వెల్ అంటే నిజంగా చేస్తే మంచి ప్రయోగమే అవుతుంది. మరి చిరంజీవి ప్రస్తుత ఇమేజ్ అన్నీ దృష్టిలో ఉంచుకుని కధను అల్లుకుంటే విజేత సీక్వెల్ కూడా మరో బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. చూడాలి మరి ఏం చేస్తారో. మెగా ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి వార్తలతో మంచి హుషార్ గా ఉన్నారు. మెగాస్టార్ ఇలాంటి ఓల్డ్ బ్లాక్ బస్టర్స్ కి సీక్వెల్స్ చేస్తే చూడాలని వారు కోరుకుంటున్నారు. అయితే సీక్వెల్స్ హిట్ కావాలంటే సరైన మేకర్స్ ని పెట్టుకుని కధ నడిపించాలి. అలా ఈ మూవీకి జరగాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: