తెలుగు ఇండస్ట్రీకి కొత్త లవర్ బాయ్ వచ్చేశాడు. న్యూలుక్ తో అమ్మాయిల మనసు దోచేస్తున్నాడు. శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌ 'పెళ్లి సందడి'తో హీరోగా వెండితెరపై మెరిశాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమాకి మిక్స్‌డ్ రివ్యూస్‌ వచ్చినా, బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. పెళ్లి సందడి సీక్వెల్, శ్రీకాంత్‌ కొడుకు సినిమా అనే బజ్‌తో జనాలు థియేటర్లకి వచ్చారు. ఈ అంచనాలతో వచ్చిన ప్రేక్షకుల నుంచి రోషన్‌కి మంచి మార్కులే పడ్డాయి. డాన్స్‌, లుక్స్‌తో ఫీమేల్ ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు.

రోషన్‌ ఫస్ట్‌ మూవీతోనే మెప్పించడంతో నెక్ట్స్‌ ఎలాంటి సినిమా చేస్తాడో అని జనాల్లో ఆసక్తి మొదలైంది. లవర్‌ బాయ్‌ లుక్‌కి తగ్గట్లు లవ్‌ స్టోరీ చేస్తాడా.. లేకపోతే నాన్న శ్రీకాంత్‌లాగా ఫ్యామిలీ సబ్జెక్ట్స్‌తో వస్తాడా అనే ఇంట్రెస్ట్ మొదలైంది. అయితే రోషన్‌ మాత్రం ఇంకా సెకండ్‌ మూవీ ప్రకటన చేయలేదు. 'పెళ్లి సందఢి'తో రోషన్‌కి బోల్డంత క్రేజ్‌ వచ్చింది. ఈ గుర్తింపుని స్టార్డమ్‌గా మలుచుకోవాలంటే సూపర్‌ హిట్‌ కావాలి. అందుకే తొందరపడకుండా జాగ్రత్తగా కథలని ఎంచుకుంటున్నాడట రోషన్. మరి ఇంత కథల విషయంలో ఇంత కేరింగ్‌గా ఉంటోన్న రోషన్‌ తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.

పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తే చాలు హీరోలకి ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. ఆ బూస్టప్‌తో ఫుల్‌ స్పీడ్‌గా సినిమాలు చేస్తుంటారు. అయితే 'పెళ్లి సందడి'తో సూపర్‌ అనిపించుకున్న రోషన్‌ మాత్రం ఇంకా నెక్ట్స్‌ మూవీ అనౌన్స్‌ చేయలేదని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి కాంప్లిమెంట్స్‌ వచ్చినా రోషన్‌ గ్యాప్‌ ఎందుకు తీసుకుంటున్నాడో అని రకరకాలుగా అయితే మాట్లాడుకుంటున్నారు. మరి రోషన్ సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న విషయం తెలియకనే ఇలా మాట్లాడుకుంటున్నారట. చూద్దాం.. రోషన్ కొత్త సినిమా విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో. ప్రేక్షకులు అయితే ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రోషన్ కు అయితే ఆల్ ది బెస్ట్ చెబుదాం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: