సినిమాలను  యాక్షన్ ,థ్రిల్లర్ ,డ్రామా ,ప్రేమ కథ వంటి వాటిలోనే కాకుండా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయడంలో దర్శకుడు శంకర్ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారని అని చెప్పవచ్చు. ఆ తరహా నిర్మించి, ఘన విజయం సాధించిన చిత్రాలలో అపరిచితుడు ఒకటి అని చెప్పవచ్చు. ఒరేయ్, కమల్ ని చూశా, రజినీను చూశా, చిరంజీవి ని చూశా,కానీ నీలా నటించేవాడిని మాత్రమే చూడలేదు రా! ఈ డైలాగ్ వింటే ఇప్పటికీ మనకు గుర్తొచ్చే సినిమా అపరిచితుడు. ఇది తమిళ్ సినిమా ఆయన అన్నియన్ కు డబ్బింగ్ గా 2005 జూన్ 17న తెలుగులో విడుదలైన చిత్రం.

ఎస్ .శంకర్ దర్శకత్వంలో వీ రవిచంద్రన్ నిర్మాతగా విక్రమ్, సదా నటీనటులుగా తెరకెక్కిన చిత్రం. ఈ చిత్రానికి హ్యరీస్ జయరాజు సంగీతం అందించారు. నాణ్యత మరియు బాధ్యత వంటి వైవిధ్య అంశాలను కథ నేపథ్యంగా తీసుకుని దర్శకుడు శంకర్ గారు ఎంత అద్భుతంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో విక్రమ్ గారు ఒకే పాత్రలో ఈ మూడు విభిన్నమైన కోణాలలో నటించి తమిళ ప్రేక్షకులను కాకుండా, తెలుగు సినీ ప్రేక్షకులను కూడా ఎంతగానో మెప్పించారు. తన చుట్టూ జరిగే పరిస్థితులను చూసి తట్టుకోలేక అలాగే ఎదిరించలేక తనలో తానే బాధపడుతున్న ఒక సాధారణ వ్యక్తి లో ఏర్పడిన మల్టిపుల్ డిజార్డర్ అనే ఒక కొత్త కథతో దర్శకుడు ఈ సినిమాలో చిత్రించిన సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.


ఈ సినిమాలో విభిన్న కోణాలలో నటించిన విక్రమ్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు కు ఉత్తమ నటుడుగా విక్రమ్ కు, ఉత్తమ దర్శకుడిగా శంకర్ కు ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈ సినిమా ఆంగ్ల  నవల అయినా టెల్ మీ యువర్ డ్రీమ్స్ ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమా చివరిలో దర్శకుడు శంకర్ చూపించిన సన్నివేశం మాత్రం ప్రతి ఒక్క భారతీయుడు లో  దాగి ఉన్న కల అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: