యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు, బాహుబలి సినిమా ముందు వరకు ప్రభాస్ కేవలం టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగాడు. బాహుబలి సినిమా తర్వాత మాత్రం ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో తన మార్కెట్ ను పెంచుకున్నాడు. ఇలా ఈ సినిమా ఇచ్చిన జోష్ లో ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు, ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ సాహో సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి అదే రేంజ్ లో విడుదల కూడా చేశాడు.

 అయితే ప్రస్తుతం కూడా ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు, ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అవడంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే తెలియజేసింది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఒక సినిమా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటించడానికి ప్రభాస్ రెడీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లిఫ్ట్ లో ఉన్న సినిమాలు అన్ని పాన్ ఇండియా, మరియు అంతకుమించిన సినిమాలే. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఒక్కో సినిమాకు దాదాపు 100  కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇండియాలోనే ఇంత మొత్తం లో పారితోషికం తీసుకునేది ప్రభాస్ మాత్రమే అని సినీ వర్గాలు అంటున్నారు. దీనితో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: