మెగా డాటర్ నిహారిక కొణిదెల 'ఒక మనసు' అనే సినిమాతో వెండితెరకు హీరోయిన్గా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత టాలీవుడ్ లో ఈమె నటించింది కొన్ని సినిమాలే అయినా తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల సినిమాలకు పుల్ స్టాప్ పెట్టిన ఈమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నిహారిక ఏకంగా నిర్మాతగా మారి చిన్న సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తోంది. ఇక ఇదిలావుంటే బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షో కి నిహారిక హాజరై పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తన వ్యక్తిగత వవిషయాల గురించి నిహారిక మాట్లాడుతూ..' హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో పుట్టానని..

 మూడో తరగతి వరకు భవన్స్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న అని, ఆ తర్వాత వేరే స్కూల్లో చదివాను అని చెప్పింది. ఇక ఇంటర్ ఓబుల్ రెడ్డి కాలేజ్ లో, ఆ తర్వాత సెయింట్ మేరీస్లో మాస్ కమ్యూనికేషన్స్ చేశానని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక నటిగా తనకు మెగాస్టార్ చిరంజీవి గారే స్ఫూర్తి అని నిహారిక కామెంట్ చేశారు. ఇక నాన్న తనను ఒకసారి కొట్టారని, ఇక అమ్మాయి ఐతే తినడం విషయంలో చాలా సార్లు కొట్టిందని, అన్నయ్య వరుణ్ బాగా ఏడిపిస్తారు అని నిహారిక తెలిపింది. అంతేకాదు వరుణ్ అన్న చాలా మాటకారి కానీ చాలా సాఫ్ట్ గా ఉంటాడని చెప్పింది నిహారిక. ఇక తాను హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా ఒక మనసు తన ఫ్యామిలీ లో అందరు చూసి ఎవరూ నచ్చలేదని చెప్పలేదని..

 ఎందుకంటే నా కష్టం వాళ్ళు చూశారని నిహారిక చెప్పింది. ఇక తన నాన్న బ్యానర్లో వచ్చిన బావగారు బాగున్నారా సినిమా తనకు చాలా ఇష్టమని అన్నారు నిహారిక. ఇక అన్నయ్య వరుణ్ తేజ్ నటించిన సినిమాల్లో గద్దల కొండ గణేష్ సినిమా అంటే తనకు చాలా చాలా ఇష్టమని నిహారిక వెల్లడించింది. ఇక రామ్ చరణ్ గురించి చెబుతూ చరణ్ అన్న నాకు అండగా ఉంటాడని.. చరణ్ అన్న మాటల్లో భరోసా ఉంటుందని నిహారిక తెలిపింది. ఇక బన్నీ గురించి చెబుతూ.. బన్నీ లుక్స్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారని, మామయ్య కొడుకు అయినా కూడా బన్నీని తాను అన్నయ్య అని పిలుస్తానని నిహారిక చెప్పుకొచ్చింది. దీంతో నిహారిక చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: