ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన వరుస సినిమాలతో బిజీ గా మారిన సంగతి తెలిసిందే. చలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ఇక ఇప్పటి దాకా షూటింగ్తో బిజీగా ఉన్న రష్మిక షూటింగ్ నుంచి నుంచి కాస్త గ్యాప్ తీసుకుని వెకేషన్ ఎంజాయ్ చేయడానికి అమెరికా బయలుదేరింది. తన బెస్టీ అయిన విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ షూటింగ్ అమెరికాలోనే జరుగుతుండగా..

 ఫ్రీ టైం ని విజయ్ దేవరకొండ తో కలిసి ఎంజాయ్ చేసేందుకు రెడీ అయిపోయింది ఈ కన్నడ బ్యూటీ. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పాస్ పోర్ట్ ఫోటోని షేర్ చేసిన రష్మిక..' ఈసారి నీకు చాలా దూరంగా ఉన్నాను. కానీ తిరిగి వస్తాను' అనే క్యాప్షన్ ను పెట్టింది. అంతే కాదు ఆ తర్వాత ఫ్లైట్ లో దిగిన సెల్ఫీ ని షేర్ చేసిన ఈమె.. 'నేను ఎక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం' అంటూ అభిమానులను అడిగింది. అయితే విజయ్ దేవరకొండ తో షూటింగ్ స్పాట్ కు వెళ్లి ఎంజాయ్ చేయడం రష్మికి కొత్తేమి కాదు. గతంలో లైగర్ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుండగా వెంటనే అక్కడికి వాలిపోయింది రష్మిక.

 ఆ తర్వాత విజయ్ తో గోవాలో వెకేషన్ లో ఎంజాయ్ చేసింది. ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండ తో ఏకంగా అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయింది ఈ హీరోయిన్. ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అటు బన్నీ కెరీర్ తో పాటు రష్మికా కెరీర్ లో కూడా పుష్ప మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా విశేషం. ఈ సినిమాతో రష్మిక మందన పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టింది. ఈ సినిమా విజయం సాధిస్తే రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోతోంది. ఇక పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి అనే పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర కోసం పూర్తి గ్లామరస్ గా మారిపోయింది. ఇక డిసెంబర్ 17న పుష్పా సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: