సంక్రాంతి కానుకగా టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి భారీ సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ అలాగే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్, అలాగే మహేష్ సర్కార్ వారి పాట సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. అయితే టాలీవుడ్ పండుగ ను మించిన పండుగను ఇప్పుడు అందిస్తుండగా సినిమా వారికి మాత్రం ఈ పండుగ ఎందుకు వచ్చిందా అన్నట్లు అనిపిస్తుంద ట. దానికి కారణం ఒకేసారి ఇన్ని పెద్ద సినిమాలు రావడమే అని అంటున్నారు.

ఎప్పుడు లేని విధంగా ఒకేసారి నాలుగు పెద్ద హీరోల సినిమాలు అంటే వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా వాటిల్లుతుంది. దాంతో ఏవైనా రెండు సినిమాలు వెనక్కి తిరిగితే బాగుంటుందని గట్టి ప్రయత్నాలే సినీ పెద్దలు చేస్తున్నారు. కానీ అవేవి వర్కవుట్ కావడం లేదు. రాజమౌళి సైతం తానే స్వయంగా రంగంలోకి దిగి ఈ ప్రయత్నాలు చేస్తున్నా డు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను అయన భేటీ కాబోతున్నారు అని తెలుస్తుంది.  పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా ఒప్పించాలని ఆయన డిసైడ్ అయ్యారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్.ఆర్.ఆర్ అభిమానులకు ఓ వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. అదేమిటంటే భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు రీ షూట్ అవుతున్నాయ ని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే సంక్రాంతికి ఆ సీన్లు రెడీ చేయడం కష్టమని తద్వారా ఆటోమేటిక్ గా ఈ సినిమా పోస్ట్ పోన్ అవడం గ్యారెంటీ అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ తన సినిమా మీద గట్టి నమ్మకంతో ఉన్నాడు. మరి ఆ సీన్స్ జోడించి ఎప్పుడు సినిమా నీ విడుదల చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: