కమల్ హాసన్ కూతురు గా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించినా స్వశక్తితో స్టార్ హీరోయిన్ అయ్యింది శృతిహాసన్. ఎందుకంటే కమల హాసన్ కూతురు అనే ట్యాగ్ ను సినిమా ఎంట్రీ వరకు ఉపయోగించుకొని ఆ తర్వాత తన కే సొంతమైన అందం అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ పెద్ద హీరోల సినిమా ఛాన్సులు కొట్టేస్తూ ఇప్పుడు ఇంతటి రేంజ్ లో హీరోయిన్ అవగలిగింది. తమిళ సినిమా పరిశ్రమలో ఆమె సినిమాలు చేయడం మొదలు పెట్టి ఇప్పుడు సౌత్ సినిమా పరిశ్రమకే గ్లామర్ ఐకాన్ గా మారింది.

బాలీవుడ్ లో సైతం ఆమెకు భారీ ఫ్యాన్ బెస్ ఉండేలా చేసుకుంది. భారీ అభిమానాన్ని ఏర్పరుచుకుని అక్కడ కూడా ఓ మోస్తరు హీరోయిన్ గా రాణిస్తుంది శృతి.  ఏదైతేనేం శృతిహాసన్ సౌత్ సినిమా పరిశ్రమలోని స్టార్ హీరోలందరితో నటించి కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది అని చెప్పవచ్చు. గ్లామర్ పరంగానే కాకుండా నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుని తనలోని నటిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక గ్లామర్ విషయంలోనూ ఇతర హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోదు శృతిహాసన్.

ప్రస్తుతం ఆమె కొంత విరామం తర్వాత తెలుగులో హీరోయిన్ గా మళ్లీ మంచి సినిమా అవకాశాలను పొందుతుంది అని చెప్పవచ్చు. క్రాక్ సినిమాతో మంచి విజయం సాధించిన తర్వాత ఆమెకు పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ సరసన సలార్ సినిమాలో హీరోయిన్ గా ఆమె నటిస్తుండగా తాజాగా నందమూరి బాలకృష్ణ మరియు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ఈమె హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఆమె ఓ సీనియర్ హీరో సరసన హీరోయిన్ గా నటించడం కొంతమందికి నచ్చలేదు. అయినా కూడా తన పాత్ర బాగా ఉండటంతో ఈ పాత్ర ఒప్పుకుందని ఆమె వెల్లడించింది. తనకి సీనియర్ హీరోలతో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది శృతి.  కాకపోతే రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉందొద్దనే కండిషన్ పెట్టిందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: