ఏపీ సర్కారు సినిమాటోగ్రఫీ చట్టానికి కొత్తగా సవరణలు చేసింది. ఇప్పుడు ఈ చట్టం గురించి టాలీవుడ్‌లో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. అయితే ఈ చట్ట సవరణతో అసలు ఎలాంటి మార్పులు వస్తాయి.. ఈ చట్టంతో లాభం ఎవరికి.. ఈ చట్టంతో నష్టం ఎవరికి.. ఓసారి పరిశీలిద్దాం..


ఈ చట్ట సవరణతో ఇకపై అన్ని సినిమాలకు టికెట్ ధర ఒక్కటే ఉంటుంది. అలాగే ఇకపై ఏ సినిమాకైనా 4 షోలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంటే.. నో బెనిఫిట్ షోస్ అన్నమాట. అలాగే సినిమా టికెట్లు ఆన్లైన్ ద్వారానే విక్రయిస్తారు. ఇవీ కొత్త సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ప్రధాన అంశాలుగా చెప్పుకొవచ్చు. అయితే ఈ మార్పులకు కొంత నేపథ్యం కూడా ఉంది. సినీపరిశ్రమలో మోహన్ బాబు, నాగార్జున మినహా అగ్రనటులు ఎవరూ జగన్ గెలవక ముందు మద్దతు ఇవ్వలేదు. పోనీ జగన్ గెలిచాకైనా అభినందనలు లేవు.


అందుకే జగన్ ఇగో హర్టయిందన్న వాదన ఉంది. నా రాజ్యంలో నేనే హీరో అనే తరహాలో జగన్ ప్రవర్తన ఉందని చెప్పొచ్చు. అంతే కాదు.. ఈ చట్ట సవరణ ద్వారా తన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ ను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ చట్టం ద్వారా కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. సరిగా పన్నులు కట్టని సినీ వర్గం ఇకపై సరిగ్గా పన్నులు కడుతుంది. ఆన్లైన్ ద్వారా అమ్మకం వలన పన్ను వసూళ్లు పెరుగుతాయి. సినిమాల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. అంతే కాదు.. పేద మధ్యతరగతి జనానికి సినిమా అందుబాటులో ఉంటుంది.


ఈ చట్టం ద్వారా వచ్చే నష్టాలేంటంటే.. సినీ పరిశ్రమ ఎక్కువగా అగ్రనటులు, వారి సినిమాలు కలెక్షన్లపై ఆధారపడి ఉంటుంది. ఇది వేల కోట్ల మార్కెట్. కానీ ఈ కొత్త నిబంధనలతో ఆ మార్కెట్ తగ్గిపోతుంది దీంతో వేల మందికి ఉపాధి నష్టం వస్తుంది. బాహుబలి వంటి సినిమాలతో పెరిగిన తెలుగు సినిమా మార్కెట్ పరిధి ఇప్పుడు ఢమాల్ అనే ప్రమాదం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: