నవంబర్ 4 దీపావళి రోజున ఆహా లో ప్రారంభం అయిన ‘అన్ ష్టాపబుల్’ టాక్ షో ప్రారంభంలోనే సంచలనాలు క్రియేట్ చేసింది. బాలకృష్ణ డిఫరెంట్ లుక్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ చూసిన బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా సగటు ప్రేక్షకుడు కూడ బాగా ఆషోకు కనెక్ట్ అయ్యాడు.సాధారణంగా బాలకృష్ణ పట్ల యూత్ పెద్దగా మోజు చూపించరు. అయితే యూత్ కూడ ‘అన్ ష్టాపబుల్’ కార్యక్రమానికి అభిమానులుగా మారిపోయారు. మొదటిగా ప్రసారం అయిన మంచు ఫ్యామిలీతో ఇంటర్వ్యూ ఆతరువాత వారంలో వచ్చిన నాని తో ఇంటర్వ్యూలు అందరికీ బాగా నచ్చడంతో ఆతరువాత వారాలలో ప్రసారం అయ్యే షోల పై అంచనాలు పెరిగి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.దీనితో ఈ షోలో రానా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు కూడ పాల్గొనబోతున్నారు అంటూ రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే అందరు ఆశ్చర్యపడే విధంగా నాని తో ప్రసారం అయిన సెకండ్ ఎపిసోడ్ తరువాత మళ్ళీ మరొక్క ఎపిసోడ్ ఈ కార్యక్రమంలో స్ట్రీమ్ కాకపోవడంతో ఈషోకు ఏమైంది అంటూ అనేక సందేహాలు ఏర్పడుతున్నాయి. దీనికితోడు బాలయ్య చేతికి సర్జరీ జరగడంతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా ఆపేసారా లేకుంటే ఈ షోను పూర్తిగా రద్దు చేసారా అంటూ సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.


మొదట్లో ఈషో 12 ఎపిసోడ్స్ గా ఉంటుందని దీనికోసం ఆహా యాజమాన్యం బాలయ్యకు 6 కోట్ల పారితోషికం ఇచ్చింది అంటూ వార్తలు కూడ వచ్చాయి. ఈ షోకు ఏర్పడిన క్రేజ్ తో ఎక్కడా బ్రేక్ లేకుండా కొనసాగి ఉంటే డిసెంబర్ లో రాబోతున్న ‘అఖండ’ మ్యానియాకు ప్లస్ అవుతుందని బాలయ్య అభిమానులు భావించారు. అయితే ఇప్పుడు ఈషో ఆగిపోయింది అని వస్తున్న వార్తలు విని బాలకృష్ణ అభిమానులు నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈషోకి సంబంధించి ఏదో ఒక క్లారిటీ ‘ఆహా’ నిర్వాహకులు ఇస్తే బాగుంటుందని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: