ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఎందుకంటే తాజాగా ఆయనకు కరోనా సోకడంతో గత నాలుగు రోజుల నుంచి హైదరాబాదులో ఉన్న ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.. ఇక పరీక్షలో వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం మాస్టర్ ఊపిరితిత్తులకు 75% కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు స్పష్టం చేశారు.. ఇక ఈయనతోపాటు ఈయన సతీమణికి అలాగే పెద్ద కుమారుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది.. ప్రస్తుతం ఈయన భార్య హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటూ ఉండగా కొడుకు మాత్రం అపస్మారక స్థితిలో ఉన్నాడు అని సమాచారం..

ఇక శివ శంకర్ మాస్టర్ విషయానికి వస్తే , ఈయన కొరియోగ్రాఫర్ గా  దేశంలో ఉన్న పలు భాషలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారుగా పది భాషలకు పైగా కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఈయన దక్షిణాదిలో ఎన్నో చిత్రాలకు ఆయన నృత్య రీతులు  సమకూర్చడం విశేషం. ఇక ఇప్పటి వరకు ఆయన సుమారుగా ఎనిమిది వందల చిత్రాలకు పైగానే డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్  గా పనిచేసిన ఈయన పలు భాషల్లో ఉత్తమ నృత్య కారుడు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు కొరియోగ్రాఫర్ గా కూడా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరా సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జాతీయ ఫిల్మ్ అవార్డును కూడా అందుకున్నారు.


ఇక శివ శంకర్ మాస్టర్ కేవలం సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేయడమే కాకుండా ఆట వంటి డాన్స్ ప్రోగ్రాం లకు జడ్జ్ గా కూడా వ్యవహరించారు. ఇక ఇప్పటికీ పలు టీవీ ఛానల్స్ లో ప్రసారమవుతున్న డాన్స్ ప్రోగ్రాం లకు అతిధిగా వచ్చి అందరినీ అలరిస్తూ ఉంటారు. అంతేకాదు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన శివశంకర్ మాస్టారు ప్రస్తుతం ఆరోగ్యం విషమించడంతో ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రజలు, ప్రేక్షకులు కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: