తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఓ క్రేజ్ వచ్చాక హీరోలు వారు చేస్తున్న సినిమాలో కథను నమ్ముకొని ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రీకరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న పవన్‌.. అనేక సినిమాలనూ రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన చిత్రాల్లో పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఉంటే.. కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.

ఆయన రిజెక్ట్ చేసిన ఫ్లాప్ చిత్రాల్లో `కంత్రి సినిమా ఒక్కటి. ఈ సినిమా కథను ముందుగా పవన్ వద్దకే రాగా.. ఆయన పలు కారణాల వల్ల రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఆ తరువాత ఈ సినిమా కథను ఎన్టీఆర్ టేకప్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డారు. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ తెరకెక్కించారు. ఈ సినిమాలో హన్సిక హీరోయిన్‌గా నటించగా.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు.

ఈ సినిమాను భారీ అంచనాల నడుమ 2008 మే 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం అందుకుంది. అంతేకాదు.. ఈ సినిమా నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఎన్టీఆర్ తన సినిమా ఎంపికలో చేస్తున్న పొరపాట్లను తెలుసుకొని అప్పటినుంచి కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెల్సిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌ సినిమా నటించగా.. ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: