మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి చాలామంది నిర్మాతలు పోటీ పడే పరిస్థితి ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ తో దర్శకుడు కథను సిద్ధం చేస్తే చాలు సినిమా చేయడానికి చాలా వరకు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ తో ప్రస్తుతం ఇద్దరు దర్శకులు సినిమాలు చేస్తూ ఉండగా కొంతమంది నిర్మాతలు ఆయన కోసం ఎక్కువగానే కష్టపడుతున్నారని ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడం కోసం కాస్త ఎక్కువగా హైదరాబాద్ తిరుగుతున్నారని సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ కు నచ్చిన విధంగా కథ కూడా సిద్ధం చేయిస్తానని అదేవిధంగా నచ్చిన దర్శకుడు తో సినిమా చేస్తానని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. ఆ సినిమా తర్వాత ఒక కన్నడ దర్శకుడితో కూడా అయిన సినిమా చేసే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సదరు బాలీవుడ్ దర్శకుడు దాదాపు యాభై కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడని సమాచారం.

అవసరమైతే దాదాపు 20 కోట్ల ముందుగానే అడ్వాన్స్ ఇస్తానని చెప్పినట్లుగా కూడా  టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఏ దర్శకుడి గురించి అడిగినా సరే కాదు అనుకున్న చేసే అవకాశం ఉందని దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళిక కూడా సిద్ధమైందని అంటున్నారు. దాదాపుగా ఈ సినిమాను బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో చేసేందుకు సదరు నిర్మాత రెడీ అవుతున్నారని జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా మరో బాలీవుడ్ అగ్రహీరో సినిమా లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: