ఇటీవల కాలంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా మారిపోతున్న వారు ఇక ప్రేక్షకులకూ అలరించేందుకు కాస్త రిస్క్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఎంతో మంది హీరోలు పాత్రల కోసం భారీగా బరువు పెరిగిపోవడం తగ్గిపోవడం లాంటి వి కూడా చేస్తున్నారు. అంతేకాదు ఒకప్పుడు డూప్ ఉంటే తప్ప ఎలాంటి స్టంట్ చేసేవారు కాదు హీరోలు.  కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ఎలాంటి డూప్ పెట్టుకోకుండానే స్టెంట్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది సినిమాల కోసం కసరత్తులు చేస్తున్నారు అని చెప్పాలి.


 అభిమానులకు నచ్చుతుంది అని భావిస్తే రిస్కు కోసం ముందడుగు వేస్తున్నారు. ఇటీవలే ఎంట్రీ ఇచ్చి కొత్త హీరో గా మారబోతున్న ఆయుష్ శర్మ కూడా ఇలాంటి రిస్కు చేసినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అంతిమ్ ది ఫైనల్ ట్రూత్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో ఒక సన్నివేశంరిస్కీ ఉందట.. ఈ సన్నివేశానికి ఎలాంటి డూప్ లేకుండానే కీలక పాత్ర పోషించిన ఆయుష్ శర్మ చేశాడు అనే విషయం ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇక క్లైమాక్స్ సీన్ కోసం 33 కిలోమీటర్ల పాటు ఆయుష్ శర్మ పరుగులు పెట్టాడట. పూణేలో ఉన్న వీధుల్లో ఈ సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణ జరిగింది. గ్యాంగ్ స్టార్ కి పోలీసులకు మధ్య జరిగే వార్ నేపథ్యంలో ఇక ఈ సన్నివేశం ఉండబోతుందట. కాగా సిక్కు పోలీస్ అధికారి పాత్రలో ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం  ప్రేక్షకులకు నచ్చాలంటే కాస్త రియలిస్టిక్ గా ఉండాల్సి ఉందట. దీనికోసం ఆయుష్ శర్మ ఏకంగా రంగంలోకి దిగి 33 కిలోమీటర్ల పాటు ఏకధాటిగా పరుగులు పెట్టినట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. కాగా ఈ సినిమా షూటింగ్ కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేశారు.  ఈ సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: