బుల్లితెరపై ఎన్నో షోలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయవతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో మరికొద్ది రోజుల్లో విజయవంతగా ఐదో సీజన్ ని పూర్తి చేసుకోబోతుంది. ఈ షోలో పాల్గొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది. ఆమె మొదట యూ ట్యూబ్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

అయితే ఈ షోలో పాల్గొన్న సిరి తన ఫస్ట్ లవ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయినా సంగతి తెల్సిందే. ఆమె పదవ తరగతిలో ఉన్నప్పుడు తన ఎదురింటి అమ్మాయిని ప్రేమించి తనతో వెళ్లిపోయానని అనంతరం అతను ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడని చెబుతూ కన్నీరు పెట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఆ తరువాత ఆమె సినీ నటుడు శ్రీహన్ ను గత ఏడు సంవత్సరాలుగా ప్రేమిస్తుందనే విషయం అందరికి తెలిసిన సంగతే.

ఇక తాజాగా సిరి ప్రియుడు బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తనకు లవ్ లెటర్ పంపించిన విషయం తెల్సిందే. ఆ లెటర్ లో ఆయన సిరి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా..  తాజాగా శ్రీహాన్ సిరితో చేసిన ఇంటర్వ్యూ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వీరిద్దరూ కలిసి వారి మొదటగా ఎప్పుడు కలిశారు. అంతేకాక.. వీరిద్దరి  ఫస్ట్ కిస్ ఎప్పుడు అనే విషయాల గురించి వెల్లడించాడు..

ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూలో భాగంగా సరైన సమాధానం చెబితే ఒకరినొకరు దిండుతో కొట్టుకోవడం, తప్పు సమాధానం చెప్తే ముద్దులు పెట్టుకోవాలని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. వారిద్దరూ ఎంతో పిచ్చిగా మాట్లాడుతూ ఒకరికొకరు ముద్దులుపెట్టుకుంటూ ఇంటర్వ్యూలో రెచ్చిపోయినట్లు సమాచారం. అంతేకాక.. తనని డేట్ కి గోవాకి ఎప్పుడు తీసుకెళ్ళావు అని మాట్లాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: