సాధారణంగా తెలుగు ప్రేక్షకులు థియేటర్లో సినిమాలు చూడటానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఇక థియేటర్లో చూస్తే ఆ మజా వేరు ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని సినిమాలు థియేటర్లో చూసినా ఓటీటీ లో చూసినా పెద్ద తేడా ఉండదు. కానీ  కొన్ని సినిమాలు మాత్రం థియేటర్లో చూస్తేనే అదిరిపోయే కిక్ వస్తుంది అని భావిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అలాంటి సినిమాల్లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఉంటాయి అని చెప్పాలి. వరుసగా ఊహించని ట్విస్ట్ లతో ఎంతో ఉత్కంఠభరితంగా సాగి పోయే సినిమా థియేటర్ లో ట్విస్టుల ను ఆస్వాదించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక ఇప్పుడు ఒక సినిమా విషయంలో కూడా ప్రేక్షకులు ఇలాంటిదే భావిస్తున్నారు. ఇటీవలే విక్టరీ వెంకటేష్ మీనా కాంబినేషన్లో జిత్తు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం 2 సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలయింది. మొదటి సినిమా లాగానే ఇక ఈ సినిమా కూడా అదిరిపోయే ట్విస్ట్ లతో ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచింది. దృశ్యం సినిమా లో క్లోస్ అయినావరుణ్ హత్య కేసు మళ్లీ దృశ్యం 2 లో రీ ఓపెన్ అవుతుంది. దీంతో ఈ కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి రాంబాబు వేసే ఎత్తులు పైఎత్తులు ప్రేక్షకులందరినీ కూడా చూస్తున్నంతసేపు మునివేళ్ళపై నిలబెడతాయి. ఇక ఈ సినిమా ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది.


 ఇక ఈ సినిమాతో విక్టరీ వెంకటేష్ మరోసూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. దీంతో అభిమానులు కూడా ఈ సినిమా చూసి ఎంతగానో మురిసిపోతున్నారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ నటన కూడా అదిరిపోయింది. అంతా బాగానే ఉంది కానీ ఏదో కిక్ మిస్ అవుతుంది అని భావిస్తున్నారు అభిమానులు. ఈ సినిమా ఓటిటీ వేదికగా కాకుండా థియేటర్లలో విడుదలై ఉంటే మాత్రం ఆ కిక్కే వేరే ఉండేది అని అనుకుంటున్నారు అభిమానులు. థియేటర్ లో భారీ సౌండ్ మధ్య ఇక ఊహించని ట్విస్ట్ లతో ఉత్కంఠభరితంగా  సాగిపోయే దృశ్యం సినిమా చూస్తే గూస్ బంప్స్ అంటూ భావిస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: