తెలుగులో కొరటాల శివ సినిమాలు అనగానే ఆయన అభిమానులకు అలాగే ఆయన చేసే హీరోల అభిమానులకూ కచ్చితంగా ఒక క్లారిటీ ఉంటుంది అనే మాట వాస్తవం. కొరటాల శివ సినిమాలకు సంబంధించి హీరోలు మరో ఆలోచన లేకుండా ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొరటాల శివ ఈ మధ్యకాలంలో అగ్ర హీరోలతో సినిమాలు చేసే విషయంలో కాస్త దూకుడుగా ముందుకు వెళుతున్న సరే కొన్ని కొన్ని కథల విషయంలో మాత్రం చిన్న చిన్న తప్పులు కూడా జరగకుండా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ఇప్పటికే ఒక కథ కూడా రెడీ చేసుకున్న ఆయన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యారని దీనికి సంబంధించి ఒక కథను ఆయన సిద్ధం చేసుకున్నారని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కథ ఉంటుందని సమాచారం. అల్లు అర్జున్ తో సినిమాకు అనుకున్న కథను జూనియర్ ఎన్టీఆర్ తో చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఈ కథ విన్న జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తి చూపించడంతో అల్లు అర్జున్ కోసం మరో కథ సిద్ధం చేసి పెట్టుకున్నారని తెలుస్తోంది.

సినిమా విషయంలో కొరటాల శివ ఎన్నడూ లేని విధంగా సిద్ధం చేయడమే కాకుండా ఈ సినిమాను కాస్త వేగంగా పూర్తి చేసే ఆలోచనలో కూడా ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తో చేసే సినిమాకు సంబంధించి ఆయన నిర్మాతలకు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు అని ఆ సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఒక స్పష్టత ఇచ్చారు అని గతంలో కంటే కూడా తక్కువ బడ్జెట్తో సినిమాను తెరకెక్కించేందుకు కొరటాల శివ ప్రయత్నం చేస్తున్నారని అలాగే వేగంగా సినిమాను పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.త్వరలో దీనిపై క్లారిటీ రావొచ్చు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: