తెలుగులో అల్లు అర్జున్ కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు. అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి ఈ మధ్య కాలంలో చాలామంది దర్శక నిర్మాతలు పోటీ పడుతుండగా అల్లు అర్జున్ కూడా కొంత మంది తో సినిమా చేయడానికి చాలా వరకు కష్ట పడే పరిస్థితి ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. అల్లు అర్జున్ ప్రస్తుతం చేసే సినిమాలకు సంబంధించి కాస్త అభిమానుల్లో కూడా ఆసక్తి ఉండగా అల్లు అర్జున్ కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు.

అల్లు అర్జున్ చేసే సినిమాల విషయంలో ఆయన భార్య స్నేహారెడ్డి కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని ఏ చిన్న తప్పు జరగకుండా ఆమె జాగ్రత్త పడుతున్నారని కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి గతంలో అల్లు అర్జున్ ఇబ్బంది పడిన నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేవిధంగా స్నేహరెడ్డి కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యం విషయంలో కూడా కాస్త శ్రద్ధ చూపిస్తున్నారని అంటున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుండగా తర్వాత సినిమా విషయంలో కూడా ఆయన సిద్ధమవుతున్నారని అంటున్నారు.

ఇందుకోసం తమిళనాడు లోని ఒక ప్రకృతి కేంద్రంలో ఆయన ఒక తెరపి తీసుకుంటున్నారని ఇందుకోసం దాదాపు నెల రోజుల పాటు ఫ్యామిలీ కి దూరంగా ఉండే అవకాశం ఉందని ఒక ప్రకృతి వైద్య కేంద్రం లో ఆయన కొన్ని థెరపీలు తీసుకున్న తరువాత ఇక్కడకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆరోగ్యం విషయంలో స్నేహ రెడ్డి కాస్త ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు అడుగులు వేస్తున్నారని ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి అవసరమైతే ఫ్యామిలీ కూడా దూరంగా ఉండేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: