టాలీవుడ్ సినీ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వెంకటేష్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. వెంకటేష్ సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తారు అన్న విష యం తెలిసిందే. ఈ క్రమంలోనే వెంకటేష్ గ‌త‌ కొద్దిరోజులుగా ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. ఓ వైపు కుర్ర హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ మరోవైపు కథాబలం ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల - మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - రామ్ తో మసాలా సినిమాలు చేశారు. అలాగే త‌న మేన‌ళ్లుడు అక్కి నేని నాగ‌చైత‌న్య తో వెంకీ మామ సినిమా కూడా చేశాడు.

ఇక వెంకీ మ‌ల‌యాళంలో వ‌చ్చిన దృశ్య‌మ్ సినిమా చేసి సూప‌ర్ హిట్ కొట్టాడు. మ‌ళ‌యాళంలో హిట్ అయిన దృశ్యం సినిమా అక్క‌డ సూప‌ర్ హిట్ అయ్యింది. అదే క‌థ తో తెలుగు లో కూడా సినిమా చేస్తే ఇక్క‌డ కూడా హిట్ అయ్యింది. నిజం చెప్పాలంటే దృశ్యం ఓ మాస్ట‌ర్ పీస్‌. జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే బ్రిలియ‌న్స్‌కి ఇదో ప‌ర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. ఏ క్రైమ్ స్టోరీలో అయినా స‌రే, హంత‌కుడు ఎప్పుడు దొరుకుతాడా ? అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తి తో వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాలో మాత్రం హంత‌కుడు దొర క కుండా ఉంటే బాగుంటుంది అని అనుకూంటూ ప్రేక్ష‌కులు ఉత్కంఠ ను ఎంజాయ్ చేస్తారు.

ఇక ఈ దృశ్యం స్పెషాలిటీ యే అది అని చెప్పాలి. అస‌లు ఈ సినిమాను ఎన్ని భాష‌ల్లో ఎన్ని సార్లు తీసినా కూడా సూప‌ర్ హిట్టే అవుతూ వ‌స్తోంది. ఇక ఇప్పుడు దృశ్యం సినిమాకు సీక్వెల్ గా వ‌చ్చిన దృశ్యం 2 సినిమాకు కూడా సూప‌ర్ టాక్ వ‌చ్చింది. ఈ సినిమా కూడా సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ ల జాబితాలో చేరిపోయింది. ప్రేక్ష‌కులు ఈ సినిమాకు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: