తెలుగు సినిమాలు రాజమౌళి గురించి చెప్పడానికి ప్రత్యేకంగా ఏమీ ఉండదు. రాజమౌళితో సినిమా అంటే చాలా చాలా మంది అగ్ర నిర్మాతలు మరో ఆలోచన లేకుండా ముందడుగు వేస్తూ ఉంటారు అదే విధంగా కొంతమంది హీరోలు కూడా మరో ఆలోచన లేకుండా ఆయన తో సినిమా చేయడానికి చాలా ఆసక్తి చూపించే పరిస్థితి ఉంటుంది అనేది నిజం. రాజమౌళి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్చరణ్తో ఓ సినిమా చేస్తున్నారు ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారు ఏంటనే దానిపై క్లారిటీ లేకపోయినా మహేష్ బాబుతో దాదాపుగా సినిమా చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

సినిమా తర్వాత ఆయన మహేష్ బాబుతో అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్ తో కలిసి సినిమా చేసే అవకాశం ఉందని జూనియర్ ఎన్టీఆర్ తో ప్రస్తుతం చేస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ తో దాదాపుగా సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అది కూడా భారీ మల్టీస్టారర్ సినిమాగా తీసుకువచ్చే అవకాశం ఉందని దీనికి సంబంధించి ఒక చారిత్రాత్మక కథను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనికి సంబంధించిన కథను ఇప్పటికే ఇద్దరు హీరోలకు పంపించారు అని అంటున్నారు.

సినిమా కధకు సంబంధించి ఇప్పటికే ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాత రాజమౌళి నిర్ణయం తీసుకున్నారని ఇది కూడా భారీ బడ్జెట్ తోనే కాకుండా ఒక రేంజ్ లో సంచలనం ఏ విధంగా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారని దీనికి సంబంధించిన టైటిల్ ను కూడా ఆయన ఇప్పటికే హీరోలకు చెప్పారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే రాజమౌళితో సినిమా అంటే చాలా మంది హీరోలు ఎగిరి గంతేసి పరిస్థితి ఉంటుంది అనేది తెలిసిన ఈ విధంగా సంచలనాలు నమోదు చేయడం మాత్రం కాస్త ఆసక్తిని రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: