ఈ మధ్యకాలంలో కథానాయకిల అందం పై ముఖ్యమంత్రుల ధ్యాస మల్లిందనే చెప్పాలి.. ముఖ్యంగా ఈ హీరోయిన్ల బూరె బుగ్గలు మంత్రులను ఆకర్షిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒక మంత్రికి ఈ మధ్య ఏం వచ్చిందో తెలియదు కానీ ఏకంగా కత్రినా బుగ్గలపై కామెంట్లు చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఆయన తాజాగా కత్రినా కైఫ్ వంటి చెంపల రోడ్లు అంటూ వ్యాఖ్యానించడంతో ప్రస్తుతం ఈ మాట కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు నెటిజనులు ఈ మంత్రి పై తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు.

ఇక  మహిళలను అగౌరపరిచేలా వ్యాఖ్యానించడంతో మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి అంటూ తీవ్రంగా ఖండిస్తున్నారు. అగౌరవ ప్రదమైన  వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు.. మంత్రి అయ్యుండి ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటూ  తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు నెటిజన్లు. స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ అందం విషయంలో రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూఢా చేసిన వ్యాఖ్యలు  ప్రస్తుతం వైరల్ గా మారాయి.ఝుంజును జిల్లాలో ఒక గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పంచాయతీరాజ్ .. గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా  పనిచేస్తున్న రాజేంద్ర సింగ్ గూడా కత్రినా కైఫ్ గురించి వ్యాఖ్య చేశారు.ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్న ఆ మాటలు ఏమున్నాయి అంటే.. గ్రామీణ ప, ట్టణ ప్రాంతాలలో వేసే రోడ్లు హేమమాలిని చెంపలలా ఉండాలి అని వ్యాఖ్యానించాడు.. కానీ ఆమె పాతబడి పోయింది కాబట్టి ప్రస్తుతం కత్రినా కైఫ్ చెంపలలా ఉండాలి అని చెప్పడంతో ఈ వార్తలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహిళలను విచక్షణా రహితంగా ఎలా పడితే అలా మాట్లాడడం మంత్రివర్యులు నేర్చుకోవాలని, నెటిజన్లు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి నాయకులనా మనం ఎన్నుకున్నది అంటూ ప్రశ్నిస్తున్నారు.. మంత్రివర్యులు మహిళలపై అసభ్యకరంగా మాట్లాడడం , ఇప్పటికైనా మానుకోవాలని అందరూ అంటూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: