సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మీనా కలిసి నటించిన లేటెస్ట్ మూవీ దృశ్యం 2. అయితే 2014లో దృశ్యం సినిమా విడుదలైంది ఆ సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం రిలీజ్ అయిన దృశ్యం 2  సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.. వెంకటేష్ నటించిన ఈ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడో పూర్తి కావడం జరిగింది కానీ కరోనా కారణంగా సినిమా విడుదల చేయడం కుదరలేదు. మొత్తానికి ఏదేమైనా ఈ సినిమా ఓ టి టి ప్లాట్ఫాం అయిన అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే రిలీజ్ అయిన దృశ్యం రెండో సినిమా టాక్ చాలా పాజిటివ్ గా ఉంది. దృశ్యం సినిమా లాగా దృశ్యం టు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని..

 ఎంతో పాజిటివ్ గా మరోసారి వెంకీ కథలో ఇంకో బ్లాక్బస్టర్ సినిమాని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇకపోతే ఈ సినిమా ముందుగా వచ్చిన దృశ్యం సినిమా లాస్ట్ నుండి దృశ్యం 2 సినిమా ప్రారంభమవుతుంది. సత్యం ముందు నుంచి ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ తనను తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలరు అనేదానిపై నడుస్తోంది. అయితే ఈ సినిమాలో కూడా దృశ్యం సినిమా ముగింపు తర్వాత నుండి వరుణ్ కేసులో తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలరు అనే విషయం చాలా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే ఈ సినిమాలో రాంబాబు పాత్రలో నటిస్తున్న వెంకటేష్ పోలీసుల నుండి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాడు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

 ఇదిలా ఉంటే సినిమా చివరి గంట లో దర్శకుడు పెట్టిన మలుపులు సినిమాలు ఇంకా ఆసక్తికరంగా చూసే విధంగా ఉంటుంది. దృశ్యం సినిమా లో నటించిన దానికంటే వందరెట్లు ఎక్కువగా ఈ సినిమాలో తన హావభావాలను చాలా క్లుప్తంగా తెలియజేస్తాడు వెంకీ. వెంకీ అంతులేని నటనతో అందరిని ఆకట్టుకుంటాడు. దృశ్యం రెండు సినిమాలు వెంకీ మీనాలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా తమ కుమార్తెల పాత్రల్లో కృతిక, ఏస్తర్‌లు  నటించారు. ఇకపోతే ఈ సినిమాలో ఈజీగా ప్రధాన పాత్రలో నటించింది సంపత్ రాజ్ కానిస్టేబుల్ గా సత్యం రాజేశ్‌, రచయితగా తనికెళ్ల భరణి, లాయర్‌గా పూర్ణ కీలక పాత్రలలో  కనిపిస్తారు. ఇన్ని ఎమోషన్స్ తో కూడుకున్న ఈ సినిమాను చూస్తే ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మరింత బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: