వెంకటేశ్ హీరోగా నటించిన దృశ్యం 2 చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా ఈ చిత్రానికి మొదటి భాగం దృశ్యం లాగానే మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకువస్తుంది. థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం మరొకసారి వెంకటేష్ కు హిట్ ను అందజేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దృశ్యం సినిమా లో ఎటువంటి అంశాలను అయితే ఉంచి సినిమా ఆద్యంతం ఆసక్తి కరం గా ఉండేలా చేశారో ఈ చిత్రంలో కూడా ఆ థ్రిల్లింగ్ అంశాలను ఉంచి ఏమాత్రం తగ్గకుండా చేసి ఈ చిత్రాన్ని ఇంతవరకు తీసుకు వచ్చారు.

కూతురి పై జరిగిన ఎటాక్ లో హీరో రాంబాబు తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో ఒక కుర్రాడిని చంపేస్తారు. అయితే అతను హై ప్రొఫైల్ ఫ్యామిలీకి చెందిన వాడు కావడంతో ఈ కేసు చాలా పెద్దది అయిపోతుంది. దాంతో వారిని మించి హీరో తెలివితేటలు ఉపయోగించి ఈ కేసు నుంచి తన కుటుంబాన్ని ఎలా బయట పడవేయగలిగాడు అనేదే ఈ సినిమా కథ. అయితే చివరికి కథ సుఖాంతం అవుతుంది ఆ తర్వాత ఈ చిత్రం కథ ఏమీ ఉండదు అని అనుకున్నారు.

కానీ దృశ్యం2 సినిమా అనౌన్స్ చేయగానే అందరూ ఒక్కసారిగా ఈ రెండవ భాగంలో చూపిస్తారు అని ఆసక్తి మొదటి నుంచి నెలకొంది. ఆ ఆసక్తికి తగ్గట్లుగానే ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. దృశ్యం సినిమా లోని ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఈ చిత్రంలో క్రమం తప్పకుండా పాటిస్తూ అదే పాత్ర యొక్క తీరుతెన్నులను ప్రదర్శిస్తూ దర్శకుడు ఎంతో బాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దృశ్యం సినిమాకు ఏ మాత్రం తగ్గని విధంగా దృశ్యం టు తెరకెక్కి సూపర్ హిట్ అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రీమేక్ హీరోగా మంచి పేరున్న వెంకటేష్ మరొకసారి మంచి రీమేక్ సినిమానీ ఎంచుకుని ఆ చిత్రాన్ని తెరపైకి తీసుకువచ్చాడు

మరింత సమాచారం తెలుసుకోండి: