ఏదైనా సినిమాను రీమేక్ చేయాలంటే హీరోపై గట్టిగానే ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే అప్పటికే ఆ సినిమాను చాలా మంది చూసే ఉంటారు. కథ కథనం అందరికీ తెలిసే ఉంటుంది. అలాంటి సినిమా తో సూపర్ హిట్ సాధించాలంటే చాలా గట్స్ ఉండాలి. దీనిలో ఏ మాత్రం తేడా వచ్చినా ఆ సినిమా ఫ్లాప్ అవడంతో పాటు దారుణమైన అవమాన భారం కూడా వచ్చి చేరుతుంది. దాంతో ఎక్కువ మంది హీరోలు ఎక్కువగా రీమేక్ చేయడానికి ఇష్టపడరు.

కానీ సినిమా ఏదైనా రీమేక్ చేసి దానిని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా చేస్తూ ఉంటాడు విక్టరీ వెంకటేష్. ఆయన కెరీర్ లో ఎక్కువ సినిమాలు రీమేక్ సినిమాలు చేశాడంటే ఆయన రీమేక్ సినిమాలపై ఎంతగా మనసు పడ్డాడో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ తమిళ సినిమా ను తెలుగులో నారప్ప పేరు తో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ ఇప్పుడు మలయాళ సినిమా దృశ్యం2 సినిమా నీ కూడా అదే పేరు తో సీక్వల్ తెరకెక్కించి ప్రేక్షకులముందుకు అమెజాన్ ప్రైమ్ లో వచ్చాడు. 

దృశ్యం సినిమా లో ప్రతి ఒక్క అంశం అందరినీ ఎంతగానో అలరించగా క్లైమాక్స్ అందరినీ ఒక్కసారిగా థ్రిల్ కి గురిచేసింది. అలానే ఈ సినిమాలోని క్లైమాక్స్ కూడా ప్రేక్షకులను మరింత థ్రిల్ కి గురి చేసి వారు ఊహించనిది ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండటంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మొదటి నుంచి సినిమా స్టోరీ అందరికీ తెలిసిన మంచి స్క్రీన్ ప్లే తో సినిమా ఆద్యంతం అలరించేలా దర్శకుడు తెరకెక్కించాడు అని చెప్పవచ్చు. ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా ఎవరు ఊహించలేకపోయారు. అలాగే దాని సీక్వెల్ లో కూడా క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంది కాబట్టే ఆ చిత్రం ఇప్పుడు ఇంత పెద్ద హిట్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: