సినిమా అయినా ఈ రోజుల్లో హిట్ కొట్టాలంటే అది హీరో మీద ఆధారపడి ఉంటుంది అని అందరూ అనుకుంటారు కానీ పెద్ద హీరోలకు సైతం ఫ్లాప్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. పెద్ద హీరో ఉన్నా కూడా ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే దానిలో కథ లేదని అర్థం చేసుకోవాలి. సినిమా ఎప్పటికీ హీరోల క్రేజ్ మీద  నడుస్తుంది అంటే ఇప్పటికీ పెద్ద హీరోలు నటించిన సినిమాలు ఏవీ కూడా ఫ్లాప్ కాకుండా ఉండాలి. కానీ పెద్ద హీరోల సినిమాలు సైతం ఫ్లాప్ అవుతున్నాయి అంటే అది కథ లోపం అని చెప్పవచ్చు.

అలా ఇటీవల కాలంలో మన దర్శకులు కథ మీద బాగా హోం వర్క్ చేస్తున్నారు. చిన్న హీరో స్టార్ హీరో స్టార్ హీరోయిన్ పెద్ద పెద్ద నటీనటులు అని ఆలోచించకుండా కథ బాగుంటే ఎవరు నటించినా కూడా ఆ సినిమా తప్పకుండా మంచి పేరు తెచ్చుకుంటున్న అని భావించి వారు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కువ సమయం నిమగ్నమై పోతున్నారు.  మంచి కథ ఉండి నటులు లేకుంటే కూడా చాలా ఇబ్బంది అందుకే మంచి కథతో పాటు మంచి హీరో ని కూడా ఎంపిక చేసుకుంటూ మన దర్శకులు ఇప్పటివరకు మంచి సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు.

ఆ విధంగా వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం రెండవ భాగం సినిమా దర్శకుడు జీతు జోసెఫ్ దృశ్యం సినిమా కథను ఎంతో బాగా తీర్చిదిద్దారని చెప్పవచ్చు. మొదటి భాగం లోనే ఆయన కథ మొత్తం చెప్పేశాక రెండవ భాగంలో ఇంకేం కథ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఈ సినిమా మొదటి భాగంలా అంత సూపర్ సక్సెస్ అవదని అని అందరూ అనుకున్నారు. కానీ మొదటి భాగం కంటే ఎక్కువ అంశాలను ఈ సినిమాలో పెట్టి ప్రేక్షకుల్లో ఈ సినిమా మంచి విజయం సాధించేలా చేశారు దర్శకుడు. దృశ్యం 2 సినిమా క్లైమాక్స్ పార్ట్ ఒకటి చాలు ఈ సినిమా ఎంత బాగా ప్రేక్షకులను అలరించింది అని చెప్పడానికి. ఓ టీ టీ లో విడుదలైన ఈ చిత్రం ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఎంతో ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: