మొదటినుంచీ ఏపీ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ విషయంలో కాస్త మొండి వైఖరిని అవలంభిస్తోందని అన్నది ప్రస్తుతం సినీ విశ్లేషకులు చెబుతున్న మాట. మొదటి నుంచి సినిమా పరిశ్రమ విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు సినీ పెద్దలకు వరుసగా షాకుల ఇస్తూనే ఉన్నాయి.ఇటీవలే మరోసారి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కూడా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి.. కేవలం రోజుకి నాలుగు ఆటలు మాత్రమే ఉంటాయి.. పెద్ద సినిమా చిన్న సినిమా  అనే తేడా లేదు అనే సినిమాలకు ఒకే టికెట్ రేటు ఉండాలి. అంతేకాకుండా మిడ్ నైట్ షో లు బెనిఫిట్ షోలు స్పెషల్ షో లకు అస్సలు పర్మిషన్ లేదు అంటూ ఇటీవలే జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక జగన్ ప్రభుత్వం నిర్ణయంతో అటు సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా అలజడి మొదలయింది అని చెప్పాలి.


 ఇక ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు అందరూ ఇలాగైతే మా పరిస్థితి ఏంటి అంటూ ఆందోళనలో పడిపోయారు. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు చాలానే ఉన్నాయి.. ఇలాంటి సినిమాలకు ప్రస్తుతం జగన్ నిర్ణయం తో కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తుంది అని సినీ విశ్లేషకులు అంటున్నారు..


 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చాలానే సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన నాలుగు పాన్ ఇండియా సినిమా లు కూడా ఉండడం గమనార్హం. అయితే మొన్నటి వరకూ పండగ సీజన్లో తమ సినిమాను విడుదల చేస్తే ఒక రేంజిలో కలెక్షన్స్ రాబట్టవచ్చు అని అనుకున్నారు నిర్మాతలు. ఒకటి రెండు షోలు ఎక్కువ గా వేసిన ప్రేక్షకులు చూస్తారు అని భావించారు. కానీ ఇప్పుడు మాత్రం జగన్ నిర్ణయంతో ఆ అవకాశమే లేకుండా పోయింది


 కాగా డిసెంబర్ 2వ తేదీన బాలయ్య అఖండ, డిసెంబర్ 17వ తేదీన అల్లుఅర్జున్ పుష్ప, డిసెంబర్ 24న నాని శ్యామ్ సింగరాయి సినిమాలు విడుదల కానున్నాయి. ఇక జనవరి నెలలో జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్, 12వ తేదీన పవర్ స్టార్  బిల్లా నాయక్, 14వ తేదీన ప్రభాస్ రాదే శ్యామ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: